డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. సమ్మర్లో ఈ భామ వెకేషన్లో జాలీగా గడుపుతోంది. తాజాగా ఈ బ్యూటీ ప్రకృతి ఒడిలో సేద తీరుతూ కనిపించింది. ఎల్లో కలర్ ఔట్ఫిట్లో మెరిసిపోయింది. ఈ ఫొటోలను కాస్త నెట్టింట షేర్ చేసింది. ఈ భామ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసిన క్షణాల్లోనే ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి.
ఈ ఫొటోల్లో నేహా శెట్టి ఎల్లో కలర్ ఔట్ ఫిట్లో కనిపించింది. సన్ లైట్లో ఎల్లో ఔట్ఫిట్లో కళ్లకు గాగుల్స్ పెట్టుకుని సూపర్ ట్రెండీగా సందడి చేసింది. క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ తన అందంతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
నేహా శెట్టి మెహబూబా అనే సినిమాతో టాలీవుడ్లో అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఈ బ్యూటీ ఆకాశ్ పూరితో కలిసి నటించింది. ఆ తర్వాత డీజే టిల్లు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఈ భామకు టాలీవుడ్లో అడపా దడపా అవకాశాలు వస్తున్నాయి.