నోరెళ్లబెట్టకండి. నిజమే.. కుక్కకు సీమంతం చేశారు. మహిళలంతా కలిసి మంగళహారతి పడుతూ.. ఏంచక్కా మహిళా గర్భిణీలకు చేసినట్టే సీమంతం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్‌డీఎన్ న్యూస్ అనే ఫేస్‌బుక్ పేజీలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియలేదు. తమ ఇంట్లో పెంచుకుంటున్న కుక్క ప్రెగ్నెంట్ అవడంతో.. సంతోషంలో ఇలా బంధువులున, స్నేహితులను పిలిచి.. సీమంతం జరిపించారు ఆ కుక్క యజమానులు. దానికి సంబంధించిన వీడియో ఇదే..
(Video Courtesy: NDN News)