హైద‌రాబాద్ మెట్రోస్టేష‌న్ల లిఫ్టుల్లో ప్రేమికుల రాస‌లీలలు.. వీడియో..!

-

కామాతురానాం.. న‌భ‌యం.. న‌ల‌జ్జ‌.. అన్నారు పెద్ద‌లు. అంటే.. కామంతో క‌ళ్లు మూసుకుపోయిన వారికి చుట్టూ ఎవ‌రు ఉన్నారో, తాము అస‌లు ఎక్క‌డో ఉన్నామో.. అన్న ధ్యాసే ఉండ‌దు. కామ క‌లాపాలు కొన‌సాగిస్తారు. స‌రిగ్గా ఇదే కోవకు చెందిన కొంద‌రు ఇప్పుడు.. బ‌హిరంగ ప్ర‌దేశాల‌నే త‌మ కామ‌క‌లాపాల‌కు అడ్డాగా మార్చుకుంటున్నారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

హైద‌రాబాద్ న‌గ‌రంలో గంట‌ల త‌ర‌బ‌డి ట్రాఫిక్‌లో ప్ర‌యాణించే వారికి స‌మ‌య భారాన్ని త‌గ్గించడం కోసం మెట్రోను అందుబాటులోకి తెచ్చారు. అయితే చార్జిలు కాసింత ఎక్కువ‌గానే ఉన్నందున మెట్రో రైళ్ల‌లో ప్ర‌యాణించే వారు త‌క్కువ‌య్యారు. ఈ క్ర‌మంలోనే స్టేష‌న్లు కూడా అంత‌గా ర‌ద్దీగా ఉండ‌డం లేదు. అయితే ఇదే విష‌యాన్ని ఆస‌రాగా తీసుకున్న కొంద‌రు ప్ర‌బుద్ధులు స్టేష‌న్ల‌లో ఉండే లిఫ్ట్‌ల‌లో రాస‌లీల‌లు కొన‌సాగిస్తున్నారు.

మెట్రో స్టేష‌న్ల‌లో ప్ర‌స్తుతం ఉన్న లిఫ్ట్‌లు ప్రేమికుల రాస‌లీల‌కు కేరాఫ్‌గా మారాయి. ప్ర‌యాణికులు త్వ‌ర‌గా స్టేష‌న్‌లోకి వెళ్ల‌వ‌చ్చనే స‌దుద్దేశంతో లిఫ్ట్‌ల‌ను ఏర్పాటు చేస్తే వాటిల్లో ప్రేమికులు కామ క‌లాపాలు కొన‌సాగిస్తున్నారు. వారిలో ఎక్కువ‌గా యువ‌తే కావ‌డం విశేషం. కాగా స‌ద‌రు ప్రేమికులు లిఫ్ట్‌ల‌లోకి ఎంట‌ర్ అవ్వ‌గానే ముద్దు మురిపాల్లో మునిగి తేలుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆ యువ జంట‌ల‌కు చెందిన ముద్దు సీన్ల‌న్నీ లిఫ్ట్‌ల‌లో ఉండే సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. ఇక ఈ వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

సాధార‌ణంగా మెట్రో స్టేష‌న్ల‌లో సీసీకెమెరా నిఘా ఎక్కువ‌గా ఉంటుంది. అడుగ‌డుగునా సెక్యూరిటీ ప‌టిష్టంగా ఉంటుంది. ఈ క్ర‌మంలో లిఫ్ట్‌ల‌లోనూ సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేశారు. ఇక ఈ కెమెరాల ద్వారా ప్ర‌యాణికుల క‌ద‌లిక‌ల‌ను ఉప్ప‌ల్ లోని క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నుంచి ప‌ర్య‌వేక్షిస్తారు. అయితే సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌యిన యువ జంట‌ల కామ‌క‌లాపాల దృశ్యాల‌ను చూసిన మెట్రో అధికారులు షాక్ అయ్యారు. దీంతో వారు మెట్రో స్టేష‌న్ల‌లో, ర‌ద్దీ చాలా త‌క్కువ‌గా ఉన్న ప్ర‌దేశాల్లో కాస్త డీసెంట్‌గా ఉండాల‌ని బోర్డులు పెట్టారు. అయిన‌ప్ప‌టికీ ప్రేమికులు త‌మ పంథాను మాత్రం మార్చుకోవ‌డం లేదు. కాగా ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్న ఈ వీడియోల ప‌ట్ల విచార‌ణ చేస్తున్నామ‌ని మెట్రో రైల్ ఎండీ ఎన్వీస్ రెడ్డి తెలిపారు. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో హుందాగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆయ‌న సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version