వామ్మో దీన్ని చక్కెర ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే క్యాన్సర్, షుగర్ రావడం ఖాయం!

-

ఏదైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాము.ముఖ్యంగా మన ఆహారాల్లో ఉప్పుతో పాటు చక్కెరను మితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే బీపీ పెరుగుతుందన్న సంగతి తెలిసిందే.అలాగే షుగర్‌ ఎక్కువగా తీసుకుంటే మధుమేహం, ఊబకాయం వస్తుందని తెలిసిందే. అయితే చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల కేవలం షుగర్ మాత్రమే కాదు క్యాన్సర్‌ కూడా వస్తుందట. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల కచ్చితంగా అధిక బరువు పెరుగుతారు. దీని వల్ల శరీరం చాలా వ్యాధులకు కారణమవుతుంది.

నిజానికి చక్కెర ఒక రకమైన ప్రో-ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిని పెంచుతుంది. ఇది క్యాన్సర్‌ జబ్బుకి కారణమవుతుందట. అలాగే ప్రముఖ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే.. చక్కెరలో రసాయనాలు, హానికరమైన లక్షణాలనేవి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇవి శరీరంలో క్యాన్సర్ కణాలను వేగంగా పెంచుతాయి. ఎక్కువ చక్కెర తినడం వల్ల శరీరంలో ట్యూమర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే చాలా అధ్యయనాల్లో తేలింది. అలాగే షుగర్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది.

ఎందుకంటే ఇందులో ఉండే ఫ్రక్టోజ్ మన బాడీ లోపల గ్లూకోజ్‌గా మారుతుంది. ఈ ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రోటీన్ సంశ్లేషణ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. దీని వల్ల క్యాన్సర్ కణాలు పెరిగే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. షుగర్ శరీరంలో జీర్ణమైనప్పుడు, పైరువిక్ ఆమ్లం శక్తితో పాటు విడుదలవుతుంది. ఇది కచ్చితంగా క్యాన్సర్ కణాల పెరుగుదలకు కారణమవుతుంది. షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊపిరిత్తుల క్యాన్సర్‌ కూడా వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే ఇది ఊపిరితిత్తులలో పొలుసుల కణాలను పెంచుతుంది, కణితులను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్‌తో పాటు, DNA కి తీవ్ర నష్టం కలిగిస్తుందని ప్రముఖ ఆరోగ్య నిపుణుల పరిశోధనలో తేలింది. కాబట్టి కచ్చితంగా షుగర్ ని కేవలం మితంగా మాత్రమే తీసుకోండి. పూర్తిగా మానేస్తే ఇంకా మంచి. చక్కరకి బదులుగా న్యాచురల్ గా దొరికే తేనే లేదా బెల్లం తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version