నూనెను అలా వాడుతున్నారా? ఆ జబ్బులు రావడం పక్కా..

-

కూరల్లో కాస్త నూనె ఎక్కువ పడితేనే టేస్ట్ కూడా బాగుంటుంది.. ఇక బోండా, బజ్జీ,పూరి లాంటి వాటిని ఎక్కువగా చేసుకుంటారు.అవి ఎక్కువ నూనెతో కూడిన వంటలు..అయితే, ఒకసారి వినియోగించగా మిగిలిన ఆయిల్ను మళ్లీ వినియోగిస్తుంటారు కొందరు.అలా వాడటం వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. వినియోగించడం వల్ల ఆరోగ్యానికి హానీకరం అవుతుంది. అప్పటికే వినియోగించిన నూనెను మళ్లీ కూర, ఇతర వంటకాలు చేసేందుకు వినియోగిస్తుంటారు.. ఆ నూనె వల్ల ఎన్నో తీవ్రమైన వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. మరి ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడటం ఎన్నో ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

 

పదే పదే వేడి చేసిన నూనెను వినియోగించడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ నూనె వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది..ఎక్కువ మంట మీద చెయ్యడం వల్ల కొవ్వులు ట్రాన్స్ ఫ్యాట్స్‌గా మారుతాయి..అవి ఎన్నో ప్రమాదాలను తెస్తాయి..అల్సర్, అసిడిటీ, కడుపులో మంట వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అజీర్తి, మలబద్దకం, విరేచనాలు పెరుగుతాయి.స్థూలకాయం, మధుమేహం సమస్యలు వస్తాయి. అందుకే ఇలాంటి నూనెను వినియోగించకుండా ఉండాలి..రక్తపోటు సమస్య పెరుగుతుంది. ఫ్రీ ఫ్యాటీ యాసిడ్లు, రాడికల్స్ విడుదలవుతాయి.

అధిక రక్తపోటు సమస్య త్వరగా పెరుగుతుంది.. అన్నీటికన్నా ముఖ్యమైనది.. ప్రాణాంతకమైన క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఆహారంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు నాశనం అవుతాయి. క్యాన్సర్ మూలకాలు పెరుగుతాయి. గాల్ బ్లాడర్ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది…చుసారుగా ఎన్ని ప్రమాదకరమైన వ్యాధులు వస్తున్నాయో..వాటిని తినే ముందు ఒకసారి ఆలోచించడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news