మహిళల జీవితంలో 40 ఏళ్ల వయసు తర్వాత వచ్చే ముఖ్యమైన దశ ప్రీ మోనోపాజ్ ఈ సమయంలో శరీరంలో హార్మోన్లు మార్పులు చాలా వేగంగా జరుగుతాయి. శరీరం అంతా వేడి ఆవిర్లు, నిద్రలేని సమస్య బరువు పెరగడం వంటి లక్షణాలు చాలా మందిని ఇబ్బంది పెడతాయి. అయితే ఈ దశను సులభంగా దాటడానికి కొన్ని సాధారణ చిట్కాలను పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇవి కేవలం అలవాట్లు మాత్రమే కాదు, మహిళ భవిష్యత్తు ఆరోగ్యానికి వేసే పునాదులు లాంటివి.. మరి ఆ అలవాట్లను మనము చూసేద్దాం..
ప్రీ మోనోపాజ్ సమయంలో శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గుతుంటాయి. ఈ హార్మోన్లు హెచ్చుతగ్గులు శారీరకంగా మానసికంగా అనేక మార్పులకు దారి తీస్తాయి. ఈ దశలో ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులో గుండె సమస్యలు ఎముకల బలహీనత వంటి సమస్యలు రావచ్చు. కానీ సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ దశను ఆరోగ్యకరంగా ఆనందంగా గడపవచ్చు.

సమతుల్య ఆహారం : ఈ సమయంలో తీసుకునే ఆహారం చాలా ముఖ్యం క్యాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు పాలు, పెరుగు, ఆకుకూరలు, చేపలు, ఎముకల బలానికి తోర్పడతాయి. అలాగే సోయానట్స్, బెర్రీలు వంటి ఈస్ట్రోజన్లు ఉండే ఆహారాలు హార్మోన్ల సమతుల్యతకు సహాయపడతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు చక్కెర, అధిక ఉప్పు తగ్గించడం మంచిది.
క్రమం తప్పకుండా వ్యాయామం : ఎక్కువమంది వ్యాయామం చేయాలని అనుకుంటారు అలా ఎక్ససైజ్ మొదలుపెడతారు కొన్ని రోజుల తర్వాత ఏదో ఒక కారణంతో వాటిని ఆపేస్తారు. అలా చేయడం వల్ల అధిక శాతం శరీరం బరువు పెరుగుతుంది. అందుకే ఎక్సర్సైజులు మొదలుపెట్టిన తర్వాత ఆపకుండా కనీసం రోజుకి 15 నిమిషాలు వ్యాయామం అవసరం. చిన్న నడక యోగ, సైకిల్ ఏది మన శరీరానికి అనువుగా ఉంటే అలాంటి వ్యాయామాలను ఎంచుకోవడం మంచిది. శరీర బరువులు నియంత్రించడంలో మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ఈ ఎక్సర్సైజులు సహాయపడతాయి. వ్యాయామం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి, నిద్ర బాగా పడుతుంది.
ఒత్తిడి తగ్గించడం: ఎక్కువ మంది మహిళలు 40 ఏళ్లు దాటిన తర్వాత పిల్లల భవిష్యత్తు గురించి ఇంట్లో ఏదైనా సమస్యలల్లో ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కోవాల్సిన టైం. అలాంటి టైం లోనే ప్రీ మోనోపాజ్ మూడు స్వింగ్స్ అనేవి సాధారణంగా ఉంటాయి. అందుకే వీటిని అధిగమించడం కోసం ధ్యానం, శ్వాస వ్యాయామాలు లేదా పుస్తకాలు చదవడం ఇష్టమైన హామీ ఏదైనా సరే మీకు నచ్చిన దాన్ని కొనసాగించడం వంటివి చేస్తే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. రాత్రిపూట బాగా నిద్రపోవడం కూడా మానసిక ప్రశాంతతకు కీలకం.
పుష్కలంగా నీరు తాగండి: శరీరంలో తగినంత నీరు ఉంటే వేడి ఆవిర్లు, చర్మం పొడిబారడం వంటి లక్షణాలు తగ్గుతాయి. ఈ టైం లో శరీరం ఎక్కువ వేడి ఆవిర్లు రావడం జరుగుతుంది. అందుకే కనీసం రోజుకి రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది.
వైద్యున్ని సంప్రదించడం : ప్రీ మోనోపాజ్ లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా అసలు మనకు వచ్చిన శారీరక ప్రాబ్లం గురించి సందేహాలను వెంటనే వైద్యుని సంప్రదించి తెలుసుకోవాలి. అవసరమైతే వైద్యులు తగిన సలహాలు, చికిత్సలు అందిస్తారు. ఏ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు.
ప్రీ మోనోపాజ్ అనేది ప్రతి మహిళ జీవితంలో సాధారణమైన దశ దీనిని ఒక వ్యాధిగా కాకుండా శరీరంలో జరిగే ఒక సహజమైన మార్పుగా అర్థం చేసుకోవాలి. ఈ మార్పులను స్వీకరిస్తూ ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తే ఈ దశను సులభంగా ఆనందంగా దాటవచ్చు.