గణేష్ నిమజ్జనంలో గన్ లో యువకుడు హల్చల్ చేసారు. అన్నమయ్య జిల్లా పీలేరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం జరిగిన గణేష్ నిమజ్జనంలో పిస్తోల్ తో డాన్స్ వేసిన యువకుడి వీడియో వైరల్ గా మారింది. గతంలో ఓ పోలీసు అధికారికి ప్రైవేటు డ్రైవర్ గా పనిచేసినట్లు గుర్తించారు.

దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అటు వినాయక నిమజ్జనాల్లో పోలీసు అధికారి దౌర్జన్యంగ వ్యవహరించాడు. బూతులు తిడుతూ.. భక్తులను బూటు కాళ్లతో తన్నాడు సీఐ శ్రీనివాసులు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో.. వినాయక నిమజ్జనాల్లో ఈ ఘటన జరిగి0ది. గత నెల 29న విగ్రహాలు ఊరేగింపుగా వస్తుండగా.. వె**వల్లారా అంటూ తిట్టారు సీఐ. అదే రోజు రాత్రి 1 గంటకు ఫైర్ స్టేషన్ వద్ద ఒక వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టారు సీఐ.
https://TWITTER.com/bigtvtelugu/status/1963092588384420045