ఆకలి కంట్రోల్ అవ‌డం లేదా..? ఇలా చేయండి..!

ఆక‌లి అనేది మ‌న‌లో ఒక్కొక్క‌రికి ఒక్కో ర‌కంగా ఉంటుంది. కొంద‌రు ఆక‌లికి ఎంతైనా స‌రే తట్టుకుంటారు. కొంద‌రు మాత్రం ఆక‌లి అవుతుంటే ఆహారం తీసుకోకుండా ఒక్క నిమిషం పాటు కూడా ఉండలేరు. అయితే అలాంటి వారిలో కొంద‌రు ఆక‌లి వ‌ల్ల ఆహారం ఎక్కువ‌గా తిని బ‌రువు పెరుగుతుంటారు. ఈ క్ర‌మంలోనే వారు ఆక‌లిని నియంత్రించుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంది. లేదంటే మ‌రింత బ‌రువు పెరిగేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రి అలాంటి వారు ఆక‌లిని ఎలా నియంత్రించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. భోజ‌నం చేసే ముందు వెజ్ లేదా నాన్‌వెజ్ సూప్ ఏదైనా స‌రే.. తాగాలి. దీంతో ఆక‌లి త‌గ్గుతుంది. అలాగే ఆహారం కూడా త‌క్కువ‌గా తింటాం. ఫ‌లితంగా బ‌రువు త‌గ్గుతారు.

2. ఆహారం తీసుకునే ముందు అల్లం ర‌సం తాగినా ఆక‌లిని నియంత్రించ‌వ‌చ్చు. అల్లం ర‌సం ఆక‌లిని త‌గ్గిస్తుంది. జీర్ణ స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది.

3. అన్నం తింటానికి ముందు డార్క్ చాకొలెట్ తిన్నా ఆక‌లి ఎక్కువ కాదు. అలాగే డార్క్ చాకొలెట్‌ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.

4. ప‌చ్చి బ‌ఠానీలు, శ‌న‌గ‌లు లేదా పెస‌ల‌ను గుప్పెడు మోతాదులో తీసుకుని ఉడ‌క‌బెట్టుకుని భోజ‌నానికి ముందు తీసుకుంటే ఆక‌లి త‌గ్గుతుంది. బ‌రువు పెర‌గ‌కుండా ఉంటారు.

5. భోజ‌నానికి ముందు ఉడ‌క‌బెట్టిన గుడ్డును తింటే ఆక‌లి త‌గ్గుతుంది. లేదా కొబ్బ‌రినూనె, ఆలివ్ ఆయిల్ ల‌తో చేసిన వంట‌కాల‌ను తింటున్నా ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అలాగే బ‌రువు త‌గ్గుతారు.