తిరుమలలో మరో దారుణం చోటు చేసుకుంది. టీటీడీ ఉద్యోగి దొంగతనానికి పాల్పడ్డాడు. తిరుమల శ్రీవారి పరకామణిలో మరోసారి వెలుగు చూసింది దొంగతనం. తిరుమల శ్రీవారి పరకామణిలో టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం చూపించాడు. పరకామణి సముదాయం నుంచి 100 గ్రాముల బంగారం బిస్కెట్ ను టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి తరలిస్తుండగా పట్టుకున్నారు విజిలెన్స్.
గోల్డ్ బిస్కెట్ ని ట్రాలీలో దాచి తీసుకు వెళుతుండగా గుర్తించారు విజిలెన్స్ అధికారులు..టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్యగా గుర్తించారు. ఇక ఈ సంఘటనపై తిరుమల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు విజిలెన్స్ అధికారులు. దీంతో టిటిడి ఔట్సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్యను అరెస్ట్ చేసి.. విచారణ చేస్తున్నారు. ఇక తిరుమల శ్రీవారి పరకామణిలో మరోసారి వెలుగు చూసిన దొంగతనంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.