నిగనిగలాడుతూ.. నోరూరించే నేరేడు పండు ప్రతిరోజూ తినడం వలన ఆరోగ్యానికి మంచిది. నేరేడు పండ్లలో క్యాల్షియమ్, ఐరన్, మెగ్నీషియమ్, ఫాస్ఫరస్, విటమిన్–సి; విటమిన్–బి కాంప్లెక్స్‌లోని రైబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్–బి6 వంటి వాటితోపాటు కెరటిన్, ఫోలిక్‌యాసిడ్ సమృద్ధిగా ఉంటాయి. ఇక వంద గ్రాముల నేరేడు పండ్లలో 0.6 గ్రాముల పీచు ఉంటుంది. నేరేడు పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
∙నేరేడు డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచడమే కాదు, డయాబెటిస్ లక్షణాలైన అతిమూత్రం, బాగా దాహంగా అనిపించడం వంటి లక్షణాలను సమర్థంగా తగ్గిస్తుంది.
∙నేరేడు పండ్లు అనేక రకాల నోటి సమస్యలనూ తగ్గిస్తాయి. దంతాలు, చిగుర్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి. నోటిలో వచ్చే కురుపులు, పుండ్లను నయం చేస్తాయి.
∙నేరేడులో పొటాషియమ్ పాళ్లు ఎక్కువ. వందగ్రాముల నేరేడులో 55 మి.గ్రా. పొటాషియమ్ ఉండటం వల్ల ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. తద్వారా గుండెజబ్బులనూ, గుండెపోటును కూడా నివారిస్తుంది.
∙ఈ పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను సమర్థంగా నివారిస్తాయి. అనీమియాకు రుచికరమైన ఔషధం నేరేడు.
∙నేరేడులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. పేగుల్లో వచ్చే అల్సర్‌లను తగ్గిస్తాయి. డయేరియా సమస్యను దూరం చేస్తాయి. మొలలను స్వాభావిక మార్గంలో తగ్గించే గుణం నేరేడులో ఉంది.
∙నేరేడులోని పాలీఫీనాల్ వంటి ఫైటోకెమికల్స్ క్యాన్సర్లతో పోరాడతాయి. అందుకే నేరేడుతో ఎన్నో రకాల క్యాన్సర్లు నివారితమవుతాయి.
∙ఈ పండ్లు ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేస్తాయి.
∙నేరేడు వికారం, వాంతులు వంటి సమస్యలను దూరం చేస్తుంది.
∙నేరేడులోని శక్తిమంతమైన పోషకాలు, ఫైటోకెమికల్స్ కారణంగా అది రోగనిరోధక శక్తిని పెంపొందించి, ఎన్నో వ్యాధులను నివారిస్తుంది.
∙ఏజింగ్ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. వయసు పెరగడం వల్ల వచ్చే అనర్థాలకు అడ్డుకట్ట వేసి, దీర్ఘకాలం యౌవనంగా ఉంచుతుంది.
∙మహిళల్లోని సంతానలేమి సమస్యను స్వాభావికంగా దూరం చేస్తుంది.
∙అనేక రకాల చర్మవ్యాధులను నిరోధిస్తుంది. ఒంటిపైన వచ్చే గడ్డలు, చర్మంపై వచ్చే తెల్లమచ్చలను తగ్గిస్తుంది.
∙ఇందులో క్యాల్షియమ్ కూడా ఎక్కువే. కాబట్టి ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. ఎముకలకు సంబంధించిన సమస్యలైన రుమాటిక్ నొప్పులు, గౌట్ సమస్య వల్ల కలిగే బాధలు నేరేడు తినడం వల్ల దూరమవుతాయి.
∙స్పీ›్లన్ ఎన్‌లార్జ్‌మెంట్‌ను కూడా నేరేడు నివారిస్తుంది.
నేరేడు ఔషదాలనిధి.. పండంతా పరమ ఔషదమే!
-