‘రంగస్థలం’ మ‌రో కొత్త రికార్డ్ !

-


సుకుమార్ దర్శకత్వంలో హీరో రామ్ చరణ్ , హీరోయిన్‌ సమంత జంటగా నటించిన చిత్రం ‘రంగస్థలం’ మార్చి30 న ఘ‌నంగా విడుదలైన ఎంత పెద్ద విజయం సాధిచిందో మ‌న‌దంరికి తెలిసిందే. ఇప్పటివరకు తెలుగులో కల్లెక్షన్స్ పరంగా నాన్ బాహుబలి రికార్డ్స్ ను బద్దలు కొట్టి అత్యధిక కలెక్షన్స్ ను సాధించిన చిత్రాల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్న ఈ చిత్రం తాజాగా మరో రికార్డు ను ఖాతాలో వేసుకుంది .

కృష్ణా జిల్లా, విజయవాడలోని అప్సర థియేటర్ల ఇప్పటికీ దిగ్విజయంగా ప్రదర్శించబడుతూ 66 వరోజు రూ.1,00,000 గ్రాస్ ను అలాగే రూ.50,000 షేర్ ను రాబట్టింది. ఆ థియేటర్లో ఈ చిత్రం రూ. 1,05,63000 కోట్ల గ్రాస్ ను అలాగే రూ.61. 22 లక్షల షేర్ ను సాధించి కొత్త రికార్డును నెలకొల్పింది. ఇంతకుముందు ఇంద్ర , ఖుషి చిత్రాలు కోటి రూపాయల గ్రాస్ ను సాధించి రికార్డు సృష్టించగా తాజాగా ‘రంగస్థలం’ ఆ రికార్డును బద్దలు కొట్టింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది .

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version