జొన్న రొట్టెలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తినేవారు. ఈ మధ్య కాలంలో జొన్నరొట్టెల వాడకం బాగా పెరిగింది. ఇంతకు ముందు చపాతీ మాత్రమే తినేవారు చాలా మంది ఇప్పుడు జొన్న రొట్టెలు తినడానికి ఇష్టపడుతున్నారు. జొన్న రొట్టెలు చాలా బలవర్ధకమైన ఆహారం. ఎముక పుష్టి కూడా ఉంటుంది. జొన్నలు ఎంతో ఆరోగ్య కరమైన ఆహారం. జొన్నపిండితో చేసిన రొట్టెలు రోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
బియ్యం, గోధుమలలో కంటే జొన్నల్లోనే ఎక్కువగా కాల్షియం ఉంటుంది. ఎముకలు బలిష్టంగా ఉండేందుకు అవసరమైన ఫాస్పరస్ ఒక కప్పు జొన్నల్లో లభిస్తుంది. ఇనుము, ప్రోటీన్లు, పీచు పదార్ధాల్లాంటి పోషకాలు కూడా జొన్నల్లో ఎక్కువ ఉంటాయి. జొన్నల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉండటంవల్ల జీర్ణశక్తిని పెంచుతుంది. జోన్నల్లో యాంటీ ఆక్సిడెంట్స్ వీటిలో పుష్కలంగా ఉంటాయి.
గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించే శక్తి వీటికి ఉంది. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నరాల బలహీనతను తగ్గిస్తాయి. జొన్నలు ఆహారం లో భాగంగా తీసుకోవడం వల్ల పెద్ద వయసులో వచ్చే మతిమరుపు, కంటిచూపు వంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.