ఒకే ప్లేట్ లో ఫుడ్ తింటున్నారా..? అయితే ఇది తప్పక తెలుసుకోండి..!

-

చాలామంది ఆహార పదార్థాలను ఇంకొకరితో షేర్ చేసుకుంటూ ఉంటారు ఇంట్లో ఆఫీసులో కూడా వాళ్ళకి అదే అలవాటు ఉంటుంది. మీరు కూడా ఒకే ప్లేట్లో అందరికీ ఆహార పదార్థాలని ఇస్తూ ఉంటారా… మీరు కూడా ఇంకొకరు ప్లేట్లో ఆహారం తీసుకుంటూ ఉంటారా.. అయితే కచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఎవరి ప్లేట్ లో ఆహారాన్ని వాళ్ళే తీసుకుంటూ ఉండాలి. చాలామంది సామాజిక బంధం పెరుగుతుందని ఇంకొకరి ఆహార పదార్థాలని వాళ్ళ ప్లేట్లో నుండి తీసుకుంటారు.

వీళ్ళ ప్లేట్లో వాటిని కూడా ఇతరులకి పెడుతూ ఉంటారు సాన్నిహిత్య భావం పెరుగుతుంది కానీ ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందే అవకాశం ఇలా తినడం వలన కలుగుతుంది. ఫ్లూ జలుబు జీర్ణసంధిత సమస్యలు అంటువ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంది. అలా ఒకరి ప్లేట్ లో నుండి ఇంకొకళ్ళు తినడం వలన ఆహారం కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. ఈ పద్ధతిలో అందరూ చేతులతో ఆహారం పాత్రలు తాకినప్పుడు తిన్నా ఆహార పదార్థాల ద్వారా బ్యాక్టీరియా వైరస్ ఆహారంలోకి ప్రవేశించి ఇబ్బందులకి గురిచేస్తాయి.

పైగా అతిగా తినేస్తుంటారు కూడా. ఒకే ప్లేట్లో అందరూ కలిసి తింటూ ఉంటే ఎంత తింటున్నామని అంచనా కూడా లేకుండా ఎక్కువగా తింటూ ఉంటారు. దీని వలన బరువు పెరగడం వంటి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఎవరి బౌల్లో వాళ్లే తినడం మంచిది శుభ్రత కూడా పాటిస్తూ ఉండాలి పరిశుభ్రంగా ఉంటే ఇలాంటి సమస్యలు రావు. పైగా వాన కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలుగుతుంటాయి అలాంటప్పుడు ఫుడ్ని షేర్ చేసుకోకపోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news