చింతపండు తింటే.. ఈ సమస్యలు వుండవు..!

-

చాలామంది వంటల్లో చింతపండుని వాడుతారు. మీరు కూడా ప్రతిరోజు చింతపండుని ఉపయోగిస్తూ ఉంటారా..? అయితే కచ్చితంగా ఈ విషయాలను మీరు తెలుసుకోవాలి. చింతపండుని ఉపయోగించడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తరచూ చింతపండును తీసుకున్నట్లయితే కొన్ని సమస్యలు దూరం అవుతాయట. సాంబార్, రసం, పులిహోర మొదలైన ఆహార పదార్థాలకు కచ్చితంగా చింతపండు ఉండి తీరాలి.

చింతపండులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి 100 గ్రాములు చింతపండులో మూడు గ్రాముల ఫైబర్, మూడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 70 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి చింతపండుని తీసుకుంటే ఫైటో కెమికల్స్ అధికంగా ఉండడం వలన చక్కటి ప్రయోజనాలని పొందొచ్చు. చింతపండుని తీసుకోవడం వలన పేగుల్లో హెల్తీ బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది శ్లేష్మం వంటి సమస్యలు దూరం అవుతాయి. చింతపండుని ఎక్కువగా తీసుకుంటే రక్తం గడ్డ కడుతుంది అంటారు కానీ రక్తం లోని చెడు కొలెస్ట్రాల్ ని అది గ్రహిస్తుంది.

చింతపండును తీసుకుంటే ఇతర ఆహార పదార్థాల నుండి ఐరన్ ను తీసుకోవడానికి సహాయపడుతుంది. చింతపండుని ఐరన్ ఉండే వాటితో కలిపి మీరు వండుకుని తింటే ఐరన్ పూర్తిగా గ్రహించడానికి అవుతుంది. చింతపండును తీసుకుంటే లివర్ సమస్యలకి కూడా దూరంగా ఉండొచ్చు. క్యాన్సర్ ని కూడా ఇది తగ్గిస్తుంది గుండె పనితీరు కూడా బాగుంటుంది
ఆర్థరైటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఇలా చింతపండుతో ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news