చాలామందికి బయటకు వచ్చినప్పుడు టాయిలెట్‌కు వెళ్లడానికి ఇష్టపడరు. కొందరికి అయితే.. అసలు ఆ ఫీలింగేరాదు. ఇంటికి రాగానే వెళ్తారు. చాలామంది.. ఇంటికి వెళ్లాక పోద్దాములే అనుకోని అలానే మూత్రాన్ని హోల్డ్ చేసుకుంటారు. వర్క్‌లో ఉన్నప్పుడు అదేదో పెద్ద పని అయినట్లు.. రౌండ్ ఫిగర్ టైమ్ వరకూ ఆగుతారు.. ఇలా మూత్రాన్ని ఆపుకోవడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి తెలుసా..?మూత్రాన్ని ఎక్కువసేపు అలవాటుగా పదే పదే హోల్డ్ చేస్తే.. మీకు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు(Urine Infections), మూత్రాశయం సాగడం, మూత్రపిండాల్లో రాళ్లు వంటి ఆరోగ్య సమస్యలు రావొచ్చు. మూత్రాన్ని ఎక్కువసేపు ఆపితే..
మూత్రపిండాలలో నొప్పి కూడా వస్తుంది.. మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పిని అనుభవిస్తారు. మూత్రాన్ని ఆపుకోవడమంటే.. కండరాల మీద ఒత్తిడి పెట్టినట్టే అని గుర్తుపెట్టుకోండి.మూత్రం ఎక్కువసేపు ఉంచడం వల్ల బ్యాక్టిరియా అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ దారితీయవచ్చు. బ్యాక్టిరియా మీ మూత్ర నాళం ద్వారా వ్యాపిస్తుంది. మూత్రంలో రక్తం కనిపించడం, మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించడం, నిరంతరంగా మూత్ర విసర్జన చేయవలసి రావడం, రంగు మారిన మూత్రం, దుర్వాసనతో కూడిన మూత్రం, పొత్తికడుపు ప్రాంతంలో నొప్పి రావొచ్చు. తక్కువ నీరు తాగే వ్యక్తులు ఇలాంటి పరిస్థితులకు ఎక్కువగా గురవుతారుఅసలు మనకు మూత్రం ఎలా తయారవుతుందో తెలుసా….పాపం కిడ్నీలు కష్టపడి లోపల వ్యర్థాలను అంతా ఫిల్టర్ చేసి ఆ చెత్తను మనం తాగిన వాటర్ ద్వారా డౌన్‌లోడ్‌కు పంపుతాయి.. అలా పంపినప్పుడు మెదడు మనకు సంకేతం ఇస్తుంది. మీరు వాటిని వెంటనే మూత్రం ద్వారా బయటకు పంపాలి.
కానీ ఎప్పుడైతే మీరు మూత్రాన్ని హోల్డ్ చేస్తారో.. ఆ వ్యర్థాలు మళ్లీ కిడ్నీలలో కలిసిపోతాయి.. అలా అవి ఎప్పుడైతే కలిసిపోతాయో.. కిడ్నీలు చేసిన పనే మళ్లీ చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా వర్క్ పెండింగ్‌లో ఉంటుంది. ఈ గ్యాప్‌లో కిడ్నీలకు తిక్కలేసి.. సరిగ్గా పనిచేయలేదే అనుకోండి.. అవి దెబ్బతింటాయి.. రాళ్లు ఏర్పడవచ్చు.. ఇంకా చాలా సమస్యలు..మనకు కూడా చేసిన పని మళ్లీ చేయాలంటే.. కోపం వస్తుందికదా.. లోపల అవయవాలకు కూడా అంతే.. మీరు బయట చేసే పనికంటే..మన బాడీ లోపల ప్రతిపార్ట్ నిరంతరం ఎన్నో విధులు నిర్వర్తిస్తుంది. మీకేం మీరు ఏది పడితే అది తినేస్తారు.. లోపల పంపకాలు జరుగుతాయి. పెద్ద ప్రాసెస్ ఉంటుందిలే.మీరు ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకొంటే.. మూత్రపిండాల్లో రాళ్లు పెరగొచ్చు. ఇది నొప్పికి కారణమవుతుంది. రాళ్లను తొలగించడానికి మీకు శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు. తక్కువ నీరు తాగేవారిలో రాళ్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి.
మీరు నిరంతరం మూత్రాన్ని ఆపుకొంటే.. మీ మూత్రాశయం విస్తరించవచ్చు. ఎప్పుడూ ఇదే చేస్తే.. మూత్రాశయం పరిమాణం మీద ప్రభావం ఉంటుంది.