మే నెల ఎండలని భరించడానికి సిద్ధంగా ఉన్నారా? ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

-

ఎండాకాలంలో తీవ్రమైన ఎండలు కనిపించేది మే నెలలోనే. ఈ నెలలో ఎండలు మరో లెవెల్లో ఉంటాయి.ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకపోయినా శరీరంలో మార్పులు జరిగి తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఎండల వల్ల వచ్చే ఇబ్బందుల్లో మొట్టమొదటిది, శరీరంలో నీరు తగ్గిపోవడమే. దానికి కారణం వేడి. అత్యధిక వేడి విడుదల కావడం వల్ల దాన్ని తట్టుకునే శక్తి శరీరాలకి ఉండదు. ఆ టైమ్ లోనే వడదెబ్బ లాంటి సమస్యలు కలుగుతుంటాయి.

ఇండియాలో ఉత్తరాదితో పోల్చితే దక్షిణాదిన ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఎండల వల్ల బ్రెయిన్ స్ట్రోక్, ఒత్తిడి, శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి.

వీటిని దూరం చేయడానికి ఏమేం జాగ్రత్తలో తీసుకోవాలో తెలుసుకోండి.

కావాల్సినన్ని నీళ్ళు తాగండి

ఎల్లప్పుడూ ఎక్కడికి వెళ్ళినా మీ బ్యాగులో వాటర్ బాటిల్ ఉంచుకోండి. తక్షణ ఎనర్జీ కోసం గ్లూకోజ్ నీళ్ళు తాగినా మంచిదే. మీ ఆరోగ్య కారణాల వల్ల ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోకూడని వైద్యులు చెబితే గనక ఎంత దాకా తీసుకోవచ్చో అడిగి మరీ తెలుసుకోండి. ఆల్కహాల్, కూల్ డ్రింక్స్, టీ, కాఫీ అస్సలు ముట్టుకోవద్దు.

వేసవిలో లభించే పండ్లని తినండి

పుచ్చకాయ, దోసకాయ, ఆకుకూరలని ఆహారంలో భాగం చేసుకోండి. ఇవి శరీరంలో నీటిశాతాన్ని పెంచుతాయి. అంతేకాదు జీర్ణశక్తిని పెంచడంలో ఈ పండ్లు చాలా సహకరిస్తాయి.

గొడుగు పట్టుకెళ్ళండి

ఎప్పుడు బయటకి వెళ్ళినా ఖచ్చితంగా గొడుగు పట్టుకెళ్ళండి. మధ్యాహ్నం పూట బయటకి వెళ్ళకుండా ఉండడమే మంచిది.

రెండుసార్లు స్నానం చేయండి

స్నానం వల్ల శరీర వేడి తగ్గుతుంది. గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మంచిది. చల్లని నీళ్ళతో స్నానం చేయడం అందరికీ ఒకేలా ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news