కొంతమంది ఉండాల్సిన దాని కంటే తక్కువ బరువు ఉంటారు. అటువంటి వాళ్ళు బరువు పెరగాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా బరువు పెరగాలని అనుకుంటున్నారా..? అయితే తప్పకుండా వీటిని ఫాలో అవ్వాల్సిందే.
వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే నెల రోజుల్లో బరువు పెరిగిపోవడానికి అవుతుంది. అయితే మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ చిట్కాల గురించి చూసేద్దాం. దీంతో బరువు పెరగడానికి అవుతుంది అలానే ఆరోగ్యం కూడా బాగుంటుంది.
పాలు మరియు అరటి పండ్లు:
పాలల్లో అరటిపండ్లు వేసుకుని తీసుకోవడం వల్ల బరువు పెరగడానికి అవుతుంది. ఎందుకంటే అరటి పండ్లలో పొటాషియం, కాల్షియం, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి అలానే మూడు నుండి నాలుగు అరటి పండ్లను మీరు రెగ్యులర్ గా పాలతో తీసుకుంటే బరువు పెరగవచ్చు.
పాలు మరియు తేనె:
పాలు మరియు తేనె కలిపి తీసుకోవడం వల్ల బరువు పెరగడం మాత్రమే కాదు మంచి రుచి కూడా వస్తుంది. ఉదయాన్నే మీరు అల్పాహారం తర్వాత పాలల్లో తేనె వేసుకుని తీసుకోవచ్చు. లేదంటే రాత్రి నిద్రపోయే సమయం లో కూడా తీసుకోవచ్చు.
పాలు మరియు డ్రై ఫ్రూట్స్:
పాలల్లో డ్రైఫ్రూట్స్ ని వేసుకుని తీసుకుంటే కూడా మంచి మంచి పోషక పదార్థాలు మీకు అందుతాయి ముఖ్యంగా ఖర్జూరం వేసుకుని తీసుకుంటే బరువు పెరగడానికి అవుతుంది.
పాలు మరియు ఓట్స్:
ఉదయాన్నే పాలల్లో ఓట్స్ వేసుకుని తీసుకోవడం వల్ల కూడా బరువు పెరగడానికి అవుతుంది. లేదంటే మీరు ఎండు ద్రాక్షని పాలల్లో వేసుకుని తీసుకోవచ్చు దీనివల్ల కూడా మీరు బరువు పెరగడానికి అవుతుంది.