పెయిన్‌ కిల్లర్స్ ఎక్కువగా వాడేస్తున్నారా..? ఈ సారి ఇలా చేయండి..!! 

-

కర్పూరానికి హిందూ సంప్రదాయంలో మంచి ప్రాముఖ్యత ఉంది. కర్పూరాన్ని పూజలోనే కాదు..ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. ఎన్నో సమస్యలకు ఇధి చక్కటి పరిష్కారం. పెయిన్‌ కిల్లర్‌గా పనిచేసే శక్తి కర్పూరానికి ఉంది. మన పూర్వీకులు వాడిన ఔషధమే ఇది..! కండ‌రాల నొప్పుల‌ను, కండ‌రాలు ప‌ట్టేయ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను తగ్గించ‌డంలో అలాగే గాయాలు, దెబ్బ‌లు త‌గిలిన‌ప్పుడు వాపుతో పాటు నొప్పి కూడా వ‌స్తుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో క‌ర్పూరం మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది.
క‌ర్పూరం మీద మెక్సికో శాస్త్ర‌వేత్త‌లు పరిశోధన చేసి ఎన్నో విషయాలను చెప్పారు. నొప్పులను తగ్గించడంలో కర్పూరం ఎలా వాడలంటే..ముందుగా ఒక గిన్నెలో ఆవ నూనెను తీసుకోవాలి. త‌రువాత ఇందులో క‌ర్పూరాన్ని వేసి క‌రిగించాలి. క‌ర్పూరం క‌రిగిన త‌రువాత ఈ నూనెను గోరు వెచ్చ‌గా చేసి నొప్పి ఉన్న భాగంలో రాయాలి. ఇలా రాయ‌డం వ‌ల్ల నొప్పి క‌లిగించే న‌రాలు శాంతించ‌డంతో పాటు ఆ భాగంలో ర‌క్త‌నాళాలు వ్యాకోచించి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ పెరుగుతుంది.
ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ ఎక్కువ‌గా జ‌ర‌గ‌డం వ‌ల్ల నొప్పి క‌లిగించే భాగాల్లో ఉండే విష ప‌దార్థాలన్నీ తొల‌గిపోతాయి. స‌హ‌జ సిద్దంగా నొప్పి త్వ‌ర‌గా త‌గ్గుతుంది. ఈ విధంగా క‌ర్పూరాన్ని పిల్ల‌ల ద‌గ్గ‌ర నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఎవ‌రైనా ఉప‌యోగించ‌వ‌చ్చు. నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు ఆయింట్ మెంట్ ల‌ను, పెయిన్ కిల్ల‌ర్ మందుల‌ను వాడ‌డానికి బ‌దులుగా ఇలా క‌ర్పూరాన్ని వాడితే ఎలాంటి సైడ్‌ ఎఫెక్స్ట్‌ రావు.
షాపులోకి వెళ్లి పెయిన్‌ కిల్లర్‌ను వేసుకోవడం తేలికే.. కానీ వాటి వల్ల భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వస్తాయి.. కొన్ని రోజులకు మీ శరీరం ఆ పెయిన్ కిల్లర్స్‌కు అలవాటు పడిపోతుంది. అప్పుడు మీరు అవి వేసుకున్నా పనిచేయవు.. నాచురల్గా తగ్గించే మార్గాలు కొంచెం టైమ్‌ పట్టినా ఫలితం ఉంటుంది. కాబట్టి ఈసారి పెయిన్‌ కిల్లర్‌ అవసరం వచ్చినప్పుడు ఇలా ట్రే చేసి చూడండి. బ్యాక్‌ పెయిన్‌ ఉంటే.. ఇలా మసాజ్‌ చేసిన తర్వాత గోరువెచ్చిన నీటిలో ఒక క్లాత్‌ వేసి కాపడంలా పెట్టుకుంటే.. ఇంకా రిలీఫ్‌ ఉంటుంది. నొప్పి త్వరగా తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version