Eyes Itchy: చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ రోజుల్లో ఫోన్, కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల కంటి సమస్యలు సర్వసాధారణం అవుతున్నాయి. కళ్లలో దురద , ఎరుపు, మంట వంటి సమస్యలు సర్వసాధారణం. ఇది బాధాకరమైనది. మీ రోజువారీ కార్యకలాపాలకు చాలా ఆటంకం కలిగిస్తుంది. కళ్ల దురద తగ్గడానికి ఈ ఇంటి చిట్కాలను పాటించండి.
కంటి దురదకు సింపుల్ హోం రెమెడీ:
దోసకాయ ముక్కలు:
దోసకాయ ముక్కలు చికాకు కళ్లకు గొప్ప ఔషధం. దోసకాయలో సహజమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇవి వాపు మరియు చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. మంట నుండి ఉపశమనం పొందడానికి దోసకాయను ముక్కలుగా కట్ చేసి మీ కళ్లపై ఉంచండి.
టీ బ్యాగ్:
గ్రీన్ టీ బ్యాగులు కళ్లకు ఓదార్పునిస్తాయి. టీ బ్యాగ్‌ని వేడి నీటిలో ముంచి కాసేపు చల్లారనివ్వాలి. అప్పుడు మీ కనురెప్పల మీద టీ బ్యాగ్ ఉంచండి. టీలోని యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గించి, కళ్లకు ఉపశమనం కలిగిస్తాయి.
రోజ్ వాటర్:
కంటి సమస్యలకు రోజ్ వాటర్ నేచురల్ రెమెడీ. రోజ్ వాటర్‌లో కాటన్ బాల్ లేదా ప్యాడ్‌ను నానబెట్టి, మీ మూసిన కనురెప్పలపై ఉంచండి. ఇది చికాకును తొలగించడానికి మరియు మీ కళ్ళను రిఫ్రెష్ చేయడానికి సహాయపడుతుంది.
కలబంద:
కలబందను సాధారణంగా చర్మ సౌందర్యాన్ని పెంపొందించడానికి ఉపయోగిస్తారు, అయితే ఇది కళ్ల దురదలకు కూడా చక్కని ఔషధంగా పనిచేస్తుంది. అలోవెరా జెల్‌ని చల్లటి నీటితో మిక్స్ చేసి, కాటన్ బాల్ సహాయంతో మీ కనురెప్పలపై అప్లై చేయండి.
కళ్లు దురదగా ఉన్నాయి పొరపాటున కూడా కళ్ల మద్ద ఒత్తిడి కలిగించేలా రుద్దకండి. కళ్లు చాలా సున్నితమైన అవయవాలు. మీరు దురదగా ఉన్నాయి అని గోళ్లతో గోక్కుంటే సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది.