రేపు ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్… కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు

-

టీ20 వరల్డ్ కప్ సూపర్‌-8లో భాగంగా జూన్‌ 20 న భారత్ , అఫ్గానిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. మొన్నటివరకు న్యూయార్క్‌లో లీగ్‌ మ్యాచ్‌లు ఆడిన టీమ్ఇండియా సూపర్‌-8 మ్యాచ్‌లను వెస్టిండీస్ లో ఆడనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్‌టన్‌ ఓవల్‌ మైదానం భారత్‌, అఫ్గాన్‌ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సందర్భంగా జట్టు సన్నద్ధతపై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు.

”జట్టులో ఉన్న వారందరూ ఏదైనా ప్రత్యేకంగా చేయాలనే ఉత్సుకతతో ఉన్నారు. మేం మా స్కిల్‌ సెషన్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటాం. ప్రతి స్కిల్ సెషన్‌లో సాధించడానికి ఏదో ఒకటి ఉంటుంది. అఫ్గాన్‌తో మ్యాచ్‌ ముగియగానే 3-4 రోజుల వ్యవధిలోనే మరో 2 మ్యాచ్‌లు  ఆడుతాం.

విరామం లేని షెడ్యూల్‌తో కాస్త ఇబ్బందిగానే ఉన్నప్పటికీ ఇవన్నీ మాకు అలవాటే. ప్రయాణాలు చేసి మరీ ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభవముంది అని అన్నారు. ప్రస్తుతం మా ఫోకస్ అంతా జట్టుగా ఏం చేయాలనే దానిపైనే ఉంది అని తెలిపారు. ఇక్కడ చాలా మ్యాచ్‌లు ఆడాం. ప్రతి ఒక్కరికి తమ పాత్ర ఏంటో తెలుసు. అందరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం” అని రోహిత్ శర్మ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news