శీతాకాలం వచ్చిందంటే చలి మొదలవుతుంది. చలిని కొంతమేరకు శరీరంలో తట్టుకోగలదు. కానీ, పెదవులు చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం వల్ల పెదవులు చలికి తట్టుకోలేక పగలడం మొదలువుతాయి. దీంతో విపరీతమైన మంట, దురద ఏర్పడుతాయి. ఈ కాలంలో పెదాలు మృదువుగా మెరిసిపోవాలంటే నిపుణుల సలహాలు తెలుసుకుందాం..
– ఈ కాలంలో దాహం వేయడం లేదు కదా అని నీరు తాగకుండా ఉంటాం. కానీ ఇది సరైన పద్ధతికాదు. సగటున శరీరానికి అవసరమయ్యే నీటితోపాటు శీతాకాలంలో ఇంకా ఎక్కువ నీళ్లను తీసుకోవాలి. దీనివల్ల శరీరంతోపాటు పెదాలు కూడా పొడిబారకుండా ఉంటాయి.
– బ్లాక్ టీ బ్యాగ్‌లను తీసుకొని గోరువెచ్చని నీటిలో ముంచాలి. రెండు నిమిషాల తర్వాత టీ బ్యాగ్‌ను పెదాల మీద అద్దుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అది పెదాలమీద తేమను ఉంచేలా చేస్తుంది.
– పెదాలు పగులకుండా ఉండాలంటే విటమిన్ బి ఉండాలి. విటమిన్ బి ఉండే పదార్థాలను ఆహారంలో తీసుకోవాలి. అంతేకాకుండా వివిధ రూపాల్లో తీసుకోవడం వల్ల పెదాలు చిట్లకుండా, ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి.
– పెదాలను పొడిగా ఉంచకూడదు. నాణ్యత కలిగిన లిప్‌బాంబ్‌లను తరచూ పెదాలకు ఐప్లె చేస్తూ ఉండాలి.
– ప్రతిరోజూ పడుకునే ముందు లిప్‌స్టిక్‌ను తప్పనిసరిగా తీసేయాలి. వెన్నతో పెదాలను మృదువుగా మసాజ్ చేయాలి.
– పెదాలు ఎల్లప్పుడూ తేమగా ఉండేందుకు కావాల్సినంత మాయిశ్చరైజర్‌ను పెదాలకు ఆరకుండా రాస్తూ ఉండాలి.
– ఈ కాలంలో పెదాలపగుళ్లతోపాటు పాదాలు పగుళ్లు కూడా ఏర్పడుతాయి. వీటికి పరిష్కారంగా.. గోరింటాకు పేస్ట్‌ను పగుళ్లున్న చోట పట్టించి ఆరాక కడిగేస్తే పగుళ్ల నుంచి పాదాలకు ఉపశమనం లభిస్తుంది.
– కాళ్లు మునిగేలా బకెట్‌లో గోరువెచ్చని నీటిలో కాసింత ఉప్పు, నిమ్మరసం వేయాలి. అందులో పాదాలను కాసేపు ఉంచి బ్రష్‌తో శుభ్రం చేసుకుంటూ పాదలు శుభ్రం కావడంతోపాటు పగుళ్లు దరిచేరవు.
– ఇక కలబంద రసం లేదా వాటితో తయారైన జెల్లీలను శీతాకాలంలో పెదవులకు రాస్తే పగుళ్లు ఏర్పడవు. శీతాకాలంలో పెదవులు పొడిబారకుండా ఉండాలంటే నీళ్లు తీసుకుంటూ ఉండాలి. శీతాకాలంలో పోషకాహారం కోసం తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.