మీగడ మెరుపులు కావాలంటే…!!!

అందంగా ఉండాలని ఆరాటపడే ప్రతీ ఒక్కరూ ఎన్నో రకాల సౌందర్య పద్దతులపై దృష్టి పెడుతూ ఉంటారు. తమ చర్మ సౌందర్యం మీగడ మెరుపులా మెరిసిపోవాలని ముచ్చటపడుతుంటారు. చాలా మంది అందాన్ని పోల్చే ముందు పాలమీగడలాంటి అందం అంటూ తెగ పొగిడేస్తూ ఉంటారు. మరి అలాంటి పాల మీగడ లాంటి అందం మీ సొంతం అవ్వాలంటే..తప్పకుండా మీగడ సాయం తీసుకోవాల్సిందే.

పాల మీగడ ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ఎంతగానో ఉపయోగ పడుతుంది. అందాన్ని ఇనుమడింప చేసే అద్భుతమైన గుణాలు ఎన్నో ఉన్నాయి. మరి మీగడ ఉపయోగించి అందాన్ని ఎలా సొంతం చేసుకోవచ్చో ఇప్పడు చూద్దాం. పాలపై మీగడ కట్టిన తరువాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ముఖానికి పట్టించాలి. మీగడలో కొవ్వు పదార్ధాలు ఎక్కువగా కాబట్టి దెబ్బతిన్న మృత కణాలని మళ్ళీ పునరుద్దరిస్తుంది.

పాల మీగడలో కొద్దిగా తేనే కలుపుకుని ముఖానికి రాసుకునే అద్భుతమైన ఫలితాలు సాదించవచ్చు. తేనెలో, మీగడలో ఉండే గుణాలు ముఖాన్ని మెరిసేలా చేస్తాయి. మీగడ లోని లాక్టిక్ యాసిడ్ చర్మంపై ఉండే మలినాలని తొలగించి చర్మం కాంతివంతగా ఉండేలా చేస్తుంది. చర్మం యవ్వనత్వాన్ని కోల్పోకుండా చేయడంలో మీగడ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది.

మొటిమలు, నల్ల మచ్చలు తొలగించడంలో కూడా మీగడ కీలకంగా పనిచేస్తుంది. అయితే మీగడ లో ఒక స్పూన్ నిమ్మరసం రాసి అప్పుడు ఫేస్ మాస్క్ వేసుకుంటే నల్లమచ్చలు పోతాయి. అయితే మీరు ఎటువంటి విధానం పాటించినా సరే తప్పకుండా వారానికి రెండు సార్ల పాటు నెలరోజుల పాటు చేస్తేనే ఫలితం కనిపిస్తుంది.