కాఫీతో మరెంత అందం..!

-

కాఫీ తాగడం వల్ల రోజంతా రిలాక్స్డ్ గా, ఫోకస్ గా ఉంటుంది. కాఫీ పొడి చాలా విధాలుగా వాడొచ్చు.
మంచి సువాసనతో రుచిగా ఉండే కాఫీ అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందానికి కాఫీ చేసే మేలు అంతా ఇంతా కాదు.

నిజంగా ఇది బ్యూటీ పదార్థం అని చెప్పొచ్చు. అయితే కాఫీని ఉపయోగించడం వల్ల అందాన్ని ఎలా పెంపొందించుకోవచ్చు..?, చర్మానికి ఎలా బెనిఫిట్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆలస్యమెందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.

డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి:

కాపీని ఉపయోగించడం వల్ల డార్క్ సర్కిల్స్ పూర్తిగా తగ్గిపోతాయి. దీని కోసం మీరు కొద్దిగా కాఫీ గింజలు తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దానిలో కాస్త కలబంద గుజ్జు వేసి ఈ మిశ్రమాన్ని డార్క్ సర్కిల్స్ ఉండే ప్రాంతంలో అప్లై చేయాలి. కాసేపు అలా వదిలేసి తర్వాత ముఖాన్ని కడిగేసుకోవాలి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ గుణాలు డార్క్ సర్కిల్స్ ని పూర్తిగా తొలగించి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.

ఫేస్ స్క్రబ్:

కాఫీ తో ఫేస్ స్క్రబ్ వేసుకోవడం వల్ల దుమ్ము, ధూళి, కాలుష్యం వలన కలిగే ఇబ్బందులు అన్నీ పోతాయి. ముఖాన్ని ఎంతో క్లియర్ గా ఉంచుతుంది. అదే విధంగా గ్లో ని కూడా పెంచుతుంది. ఈ ఫేస్ స్క్రబ్ కోసం మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు కూడా. కొద్దిగా కాఫీ గింజల్ని పంచదార వేసి పొడి చేసి దానిలో ఆలివ్ ఆయిల్ కలుపుకుని స్క్రబ్ కింద వేసుకోవాలి. అంతే దీనితో కూడా మీరు చక్కటి ప్రయోజనాలు పొందవచ్చు.

మృదువైన పెదవులు:

కాఫీ వల్ల పెదవులు కూడా మృదువుగా మారతాయి. అందంగా స్మూథ్ గా మీ పెదాలు ఉంటాయి కొద్దిగా కాఫీ గింజలు పొడి లో తేనె కలుపుకుని దానిని పెదాలపై అప్లై చేస్తే సరిపోతుంది. పదవులు పొడిబారిపోయినా పగిలిపోయినా కూడా అందంగా మారిపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news