టోక్యో: ఒలింపిక్స్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తున్నారు. ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత్ ఫైనల్‌కు చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ సౌరబ్ చౌదరీ అర్హత సాధించారు. 586 పాయింట్లతో సౌరబ్ చౌదరీ అగ్రస్థానంలో నిలిచారు. మరో భారత షూటర్ అభిషేక్ వర్మ ఫైనల్స్‌కు చేరుకోలేకపోయారు. 575 పాయింట్లతో 17వ స్థానంలో నిలిచారు.
ఇప్పటికే భారత పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్‌లో శుభారంభం సాగించింది. పూల్ ఏ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 3-2గోల్స్ తేడాతో విజయం సాధించారు. ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు భారత్ అర్హత సాధించింది. చైనీస్ తైపీపై 5-3తేడాతో దీపికాకుమారి, ప్రవీణ్ జాదవ్ అద్భుత విజయం అందుకున్నారు. క్వార్టర్ ఫైనల్‌లో దక్షిణ కొరియాతో భారత్ అవకాశం తలపడే అవకాశం ఉంది.
అయితే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల క్వాలిఫికేషన్‌లో భారత్‌కు నిరాశ మిగిలింది. భారత మహిళా షూటర్లు ఫైనల్‌కు చేరలేకపోయారు. 625.5 పాయింట్లతో 16వ స్థానంలో ఎలవెనిన్ వలేరియన్ నిలిచారు. 621.9 పాయింట్లతో 36వ స్థానంలో అపూర్వి చందేలా 36వ స్థానంలో నిలచారు.