నుదురు ఆకృతి బట్టి.. బొట్టు..

-

మహిళలను చూసిన వెంటనే అందరి దృష్టినీ ఆకర్షించేది వారు కట్టుకున్న చీరతోనో నగలతోనో కాదు. వారి నుదుటి మీద ఉండే బొట్టుతో. ఆడవారి ముఖం అందంగా ఆకర్షనీయంగా కనిపించడానికి ప్రధాన కారణం కళ్ళకు పెట్టుకున్న కాటుక, నుదుటి మీద ఉండే తిలకం బొట్టు. నుదిటి ఆకృతిని బట్టి బొట్టు పెట్టుకుంటే అందం రెట్టింపు అవుతుంది.

1. శరీరం రంగు, వేసుకునే దుస్తుల రంగును బట్టి ఎలాంటి బొట్టు పెట్టుకోవాలో నిర్ణయించుకోవాలి. నుదురు ఆకృతిని బట్టి కూడా ఏ బొట్టు నప్పుతుందో చూసుకోవాలి. నుదురు చిన్నగా ఉంటే కొంచెం పొడవుగా ఉండే బొట్టు పెట్టుకోవాలి.

2. కొంతమందికి నుదురు వెడల్పుగా ఉంటే గుండ్రని బొట్టు మరింత అందాన్నిస్తుంది. నుదురు పెద్దగా ఉండేవారు బొట్టును కనుబొమ్మల మధ్య కాకుండా కొంచెం పైకి పెట్టుకుంటే అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది.

3. శరీరాకృతిని, శరీర ఛాయను బట్టి కూడా బొట్టును సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే ముఖం మరింత అందంగా కళగా కనిపిస్తుంది. చామనఛాయ, అంతకన్నా కాస్తరంగు తక్కువగా ఉన్న వారైతే ఆరెంజ్, పింక్, ఎరుపు బొట్టు కళగా ఉంటుంది.

4. తెల్లని శరీరఛాయ కలిగిన ముదురురంగు బొట్టు ఆకర్షనీయంగా ఉంటుంది. కళ్ళు పెద్దవిగా ఉంటే పెద్ద బొట్టు, చిన్నగా ఉంటే కొంచెం చిన్నసైజు బొట్టు పెట్టుకుంటే చూడ ముచ్చటగా ఉంటుంది.

5. కళ్లు చిన్నగా ఉన్నవారికి రకరకాల ఆకృతులు, మ్యాచింగ్ రంగుల బొట్టు పెట్టుకున్నా బాగుంటుంది. కానీ, మధ్యవయసు వారికి ఎరుపు, పింక్ వంటి రంగులు పెట్టుకుంటే చక్కగా ఉంటుంది.

6. చిన్నవయసు వారికి ఎలాంటి బొట్టు పెట్టుకున్నా నప్పుతుంది. ఇకపోతే మధ్యవయసు వారికి గుండ్రటి బొట్టు మాత్రమే బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news