వయస్సుతో సంబంధం లేకుండా ప్రస్తుత కాలంలో అందరికి జుట్టు తెల్లబడిపోతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మనం తీసుకునే ఆహారంలో విటమిన్,పోషకాల లోపం వల్ల కూడా జుట్టు తెల్లబడిపోతుంది. అయితే తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి రంగులని కొని వాడడం జరుగుతోంది. కానీ ఈ రంగులని వాడడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు వస్తూ ఉంటాయి. తరచూ వీటిని ఉపయోగిస్తే తలనొప్పితో పాటు క్రమంగా కంటి చూపు తగ్గిపోవడంలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మరి ఏ సమస్య రాకుండా సహజంగా ఎలా మార్చాలి..? ఈ విషయం లోకి వస్తే… జుట్టుకి వెల్లుల్లి వాడితే మంచి ఫలితం ఉంటుంది.
సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా పని చేస్తుంది. అయితే వెల్లుల్లి తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో మనకి తెలుసు. రోజూ ఆహారంలో వెల్లుల్లిని వాడితే జలుబు, దగ్గు,ఆస్తమా, శ్వాస తీసుకోవడం లో ఇబ్బంది ఇలాంటి సమస్యలు తొలగిపోతాయి. ఇది ఇలా ఉండగా ఇక జుట్టు విషయానికి వస్తే.. వెల్లుల్లి పొట్టుతో మనం తగ్గించుకోవచ్చు.
మొదట మీరు ఎప్పటికప్పుడు వెల్లుల్లి పొట్టుని దాచి పెడుతూ ఉండండి. దానిలో ఉండే పుల్లలు, వేర్లు లాంటివి తీసి పడేయండి. ఇప్పుడు ఆన్ చేసి ఒక పెనం పెట్టి, అందులో ఈ వెల్లుల్లి పొట్టును వేసి బాగా నల్లగా అయ్యే వరకు వేయించాలి. సుమారు 20 నిమిషాల వరకు వేగాక… ఇప్పుడు ఆ పొట్టుని తీసి జార్లో వేసి బాగా మెత్తగా బ్లెండ్ చేయాలి. మూడు స్పూన్ల ఆ పౌడర్కు రెండు స్పూన్ల కొబ్బరి నూనె కలిపి, జుట్టుకు పట్టించండి. గంట పాటు ఆరాక…. గోరువెచ్చని నీటితో కడిగేస్తే, అచ్చం కలర్ వేసుకున్న జుట్టులాగే కనిపిస్తుంది. ఈ పద్ధతిని కనుక రిపీట్ చేస్తే మీ కురులు నల్లగా మారిపోతాయి.