మెమరీ లాస్ సమస్య రాకుండా ఉండడానికి కావాల్సిన పాజిటివ్ మంత్రం..

-

వయసు పెరుగుతున్నకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతుంటుంది. వృద్ధాప్యం దగ్గరపడుతున్న కొద్దీ గత కాలపు జ్ఞాపకాలు అంత తొందరగా గుర్తుకు రావు. దీనికి గల కారణాలు చాలా ఉన్నాయి. అందులో మొదటిది, వయసు పెరగడం వల్ల వారి జీవితాల్లో చాలా జ్ఞాపకాలు దాగి ఉంటాయి. వాటన్నింటిలో నుండి మనకు కావాల్సిన వాటిని వెంటనే గుర్తుకు తెచ్చుకోవడం జరగదు. ఉదాహరణ ప్రకారం చెప్పాలంటే, ఎక్కువ మెమరీ స్పేస్ ఉన్న మెమరీ కార్డులో నుండి మనకు కావాల్సిన దాన్ని వెతుక్కోవడం ఎలా ఆలస్యమవుతుందో, అలానే ఎక్కువ వయసున్న వారి జీవితాల్లో నుండి జ్ఞాపకాలని వెతకడం ఆలస్యమవుతుంది.

ఐతే మెమరీ లాస్ అందరికీ ఒకేలా ఉండదట. జీవితాన్ని చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవించే వారు మెమరీ లాస్ సమస్యలు ఉండవని పరిశోధన ద్వారా కనుక్కున్నారు. జీవితంలో పాజిటీవిటీ తో ఉండేవారికి జ్ఞాపక శక్తి సమస్యలు రావని కనుక్కున్నారు. ఈ మేరకు ఇల్లినాయిస్ కి చెందిన నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ విధంగా కనుక్కున్నారు.

దీనికోసం వెయ్యి మందిని తీసుకుని 1995 నుండి 1996, 2004, 2006, 2013, 2014 మధ్య కాలంలో జరిగిన సంఘటనలని గుర్తు చేసుకొమ్మని చెప్పారు. ఒకానొక పదాలని వాళ్ళకి వినిపించి వాళ్ళకి ఆ టైమ్ లో ఏమి గుర్తుకువచ్చిందో, పదిహేను నిమిషాల తర్వాత ఏమి గుర్తుకు వచ్చిందో చెప్పమని కోరారు. ఐతే జీవితాన్ని ఉల్లాసంగా జీవించే వారు ఈ టెస్టులో చాలా ఈజీగా పాస్ అయ్యారట. దీనివల్ల తెలిసింది ఏమిటంటే జ్ఞాపకశక్తి అనేది పాజిటివిటీపై ఆధారపడి ఉంటుంది.

అందుకే జీవితాన్ని హాయిగా జీవిస్తే ఆరోగ్య సమస్యలే కావు. ఇలాంటి మెమరీ లాస్ కి సంబంధించిన సమస్యలు కూడా రావు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version