గోధుమలు కంటే.. ఆరోగ్యానికి మేలు చేసే పచ్చజొన్నలు.. లాభాలు తెలిస్తే వైట్ రైస్ మానేస్తారు కూడా..!

-

ప్రస్తుతం ఎక్కువగా వాడే ప్రధాన ఆహార ధాన్యాలు రెండు.. బియ్యం, గోధుమలు. అన్ని ధాన్యాలతో పోలిస్తే బియ్యంలో తక్కువ పోషక పదార్థాలు ఉంటాయి. తక్కువ పీచుపదార్థాలు, ఎక్కువ కార్భోహైడ్రేట్స్ ఉంటాయి. ఘగర్ త్వరగా పెరిగే హై గ్లైసమిక్ ఇండెక్స్ బియ్యం. గోధమలు తీసుకుంటే.. గ్లూటిన్ అనే హానికలిగించే ప్రోటీన్ ఉంటుంది. ఇది ప్రేగులకు పట్టుకుంటుంది. మరీ ఈ రెండు ఆరోగ్యానికి అంత మంచివి కావు.. ఇక ఏం తినాలనేగా మీ ప్రశ్న. మన పూర్వీకులు అందరికి ప్రధాన ఆహారాలుగా ఉన్నవి..రాగులు, జొన్నలు, సజ్జలు.

ఈ మూడు ఎక్కువగా ఉండేవి. వీటిల్లో జొన్నలు తీసుకుంటే పచ్చ, తెల్ల అని రెండు రకాలుగా ఉంటాయి. గ్లూటెన్ ఫ్రీ జొన్నలు. బియ్యంతో పోలిస్తే జొన్నల రేటు తక్కువ..కానీ పోషకాలు చాలా ఎక్కువ. వాడకం కూడా తక్కువ. జొన్నల్లో పచ్చజొన్నలు ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయో మీకు అ‌వగాహన కల్పించే ప్రయత్నమే మా ఈ ఆర్టికల్ సారాంశం..

100 గ్రాముల పచ్చజొన్నల్లో ఉండే పోషకాలు

  • కాలరీలు 349 శక్తి
  • పిండిపదార్థాలు 62 గ్రాములు
  • ప్రొటీన్ 10 గ్రాములు.. బియ్యంలో 7 గ్రాములే..పాలిష్ పట్టిన బియ్యంలో అవి కూడా ఉండవు.
  • ఫ్యాట్ 2 గ్రాములు
  • ఫైబర్ 9.5 గ్రాములు. బియ్యంలో 1గ్రాము మాత్రమే.

పచ్చజొన్నలు లో గ్లైసిమిక్ ఇండెక్స్..ఏ ఆహార పదార్థాల్లో అయితే..హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుందో..రక్తంలోకి చెక్కర స్పీడ్ గా వెళ్తుంది. త్వరగా రక్తంలో చెక్కర పెరుగుతుంది. పచ్చజొన్నలు స్పెషల్ గా లో గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉండటంవల్ల మెల్లగా అరుగుతాయి..మెల్లగా చెక్కరను తయారు చేస్తాయి. అందుకని ఘగర్ ఉన్నవారికి పచ్చజొన్నలు చాలా మంచివి..ఘగర్ లేనివారికి కూడా దాని భారిన పడకుండా చాలా హెల్ప్ చేస్తాయి.

పచ్చజొన్నల్లో ఉండే ఫైబర్ ఎలా ఉపయోగపడుతుందంటే..ఈ పచ్చజొన్నలు అరిగి చెక్కరగా మారిన తర్వాత ఇందులో ఉన్న కార్భోహైడ్రేట్స్ గ్లూగోస్ గా మారుతాయి. అ‌వి కూడా స్లోగా మారుతాయి..అది బ్లడ్ లోకి స్పీడ్ గా వెళ్లకుండా..స్లోగా వెళ్తుంది.

ఇందులో ఉండే స్పెషల్ ఫ్లైవనాయిడ్ కారణంగా..దీనికి గ్రీన్ కలర్ రావడానికి..లైట్ చేదుగా ఉండానికి కారణం..లైట్ చేదు ఉండటం వల్ల పెద్దలకు వచ్చే ఇన్సలిన్ రెసిస్టిన్స్ తగ్గిస్తాయి.

ఇందులో ఉండే హై ఫైబర్, హై ప్రోటీన్ కారణంగా..ఆహారంలో ఉండే కొలెస్ట్రాల్ రక్తంలోకి చేరకుండా..మోషన్ ద్వారా బయటకువచ్చేస్తాయి.సుఖవిరోచనం అ‌వడానికి జొన్నలు చాలా మంచిది. అలాంటి పచ్చజొన్నలను తెచ్చుకుని బాగుచేసుకుని ఎండపెట్టుకుని పిండిపట్టించుకుని..జొన్నరొట్టెలు చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్క జొన్నరొట్టె వేసుకుని..ఎక్కువ కూరవేసుకుని తింటే..లైఫ్ లో అసలు ఘగరే రాదు.

జొన్నరొట్టే చేసి విధానం..

పొయ్యిమీద గిన్నె పెట్టి వాటర్ పోసి వేడిచేయండి.. ఆ తర్వాతా అందులో ఒక కప్పు నీళ్లకు ఒక కప్పు జొన్నపిండి మోతాదులో వేసి బాగా కలిపి మూములు చపాతీలు చేసినట్లే చేయండి..  కాకపోతే.. బలంగా కాకుండా.. కాస్త సాఫ్ట్ గా రుద్దుకోండి. కాల్చేప్పుడు నూనె వేయకుండా.. ఒక క్లాత్ ను తడిపి జొన్నరొట్టపై రుద్దితే అందులో ఉన్న పచ్చిదనం పోయి.. చక్కగా పొంగుతుంది. ఇలా చేసుకుంటే జొన్నరొట్టెలు విరగకుండా చక్కగా వస్తాయి.

జొన్నరవ్వగా చేసుకుని.. జావగా, ఉప్మాగా, దోశగా, ఇడ్లీగా చేసుకుని కూడా తినొచ్చు. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి పాలిష్ పట్టిన తెల్ల బియ్యాని వీలైనంత త్వరగా మానేసి.. ఇలాంటి వాటిని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news