అల్లంని ఏ విధంగా వాడుకుంటే ఎలాంటి లాభాలుంటాయో తెలుసుకోండి.

-

బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు అల్లం టీ తాగితే ఆ కిక్కే వేరు. అల్లంలో ఉండే పోషకాలు అనేక రోగాల నుండి కాపాడి ఆరోగ్యంగా ఉండేందుకు మేలు చేస్తాయి. ఇందులో ఉండే యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు అనేక వ్యాధులను దూరం పెట్టి రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఐతే అల్లంని ఎలా వాడాలో తెలుసుకుంటే ఎలాంటి లాభాలు పొందవచ్చో తెలుసుకుందాం.

ఆహారంలో

మన కూరల్లో అల్లం వేసుకోవడం అందరికీ అలవాటే. అది మంచిది కూడా. దీనివల్ల శరీర జీర్ణక్రియ పనితీరు మెరుగవుతుంది. ఇందులో ఉండే యాంటీఇన్ ఫ్లేమేటరీ కారకాలు జీర్ణక్రియ పనితీరును బాగు చేస్తుంది.

అల్లం టీ

ముక్కు దిబ్బడ, తలనొప్పి, జలుబు వంటి సమస్యలు బాధిస్తున్నట్లయితే వేడి వేడి అల్లం టీ తాగండి. ముక్కు దిబ్బడ నుండి ఉపశమనం కలిగి మంచి ప్రశాంతత అందిస్తుంది. టీ తాగే అలావాటున్న వారు ఖచ్చితంగా ఈ ప్రయత్నం చేసి చూడండి. అంతే కాదు రక్త ప్రసరణ వేగాన్ని మెరుగుపరిచి, గుండెకి సంబంధించిన ఇబ్బందులని రాకుండా కాపాడుతుంది. టీ వల్ల అనేక ఇతర సమస్యలు వస్తాయని బాధపడేవారు అల్లం టీతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఖచ్చితంగా తెలుసుకోవాలి.

మహిళల ఇబ్బందులకు

రుతుక్రమ సమస్యలు వచ్చినపుడు అల్లం చేసే మేలు మర్చిపోలేనిది. గోరు వెచ్చని నీటిలో అల్లం వేసుకుని అందులో టవల్ ని నాన బెట్టి కాసేపయ్యాక దాన్ని తీసుకుని పొత్తి కడుపు మీద పెట్టుకోవాలి. దీనివల్ల కండరాలు శాంతపడి నొప్పి కలగకుండా ఉంటుంది. అల్లం టీ తాగినా మంచి ఫలితం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version