ప్రతి నెల మహిళలు పీరియడ్స్ ను ఎదుర్కోవడం సహజమే. అయితే ఆ సమయంలో ఎంతో ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి వలన మహిళలు ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటారు. కాకపోతే ఎలాంటి ఫలితం ఉండదు. అయితే పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించుకోవడానికి రోజువారి ఆహారంలో భాగంగా రోజ్ షర్బత్ లేక రోజ్ టీ ని తాగవచ్చు. ఇలా చేయడం వలన పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది మరియు బరువు తగ్గాలనుకునే వారు కూడా దీనిని తీసుకోవచ్చు.
కేవలం పీరియడ్స్ నొప్పిని తగ్గించడం మాత్రమే కాకుండా రోజ్ షర్బత్ లేక రోజ్ టీ ని తీసుకోవడం వలన రోజంతా హైడ్రేటెడ్ గా ఉంటారు. ముఖ్యంగా వేసవికాలంలో దీనిని తీసుకోవడం వలన డిహైడ్రేషన్ వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అదేవిధంగా రోజ్ షర్బత్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని వలన శరీరంలో ఫ్రీ రాడికల్స్ తొలగిపోతాయి మరియు ఒత్తిడి వంటి సమస్యలను దూరం చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కూడా రోజ్ టీ లేక షర్బత్ ఉపయోగపడుతుంది.
కనుక ప్రతిరోజు వీటిని తాగడం వలన గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రతిరోజు రోజ్ టీ తాగడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. పైగా శరీరంలో వేడి కూడా తగ్గుతుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి అని అనుకుంటే తప్పకుండా ప్రతిరోజు రోజ్ టీ మరియు రోజ్ షర్బత్ లను తీసుకోండి. దీనివలన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మరియు ఒత్తిడి వంటి సమస్యలు ఎంతో త్వరగా తగ్గిపోతాయి. కనుక తప్పకుండా రోజ్ టీ మరియు రోజ్ షర్బత్ లను రెండు నెలల పాటు తీసుకోండి. దీంతో ఎంతో మంచి ఫలితాలను పొందుతారు.