పదవీ రాకుంటే ఎవరికైనా అసంతృప్తి ఉంటుంది.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. పదవీ రాకపోతే ఎవరికైనా అసంతృప్తి ఉంటుంది. అది సహజం అని.. ప్రస్తుతం నేను కూడా అసంతృప్తితోనే ఉన్నానని హాట్ కామెంట్స్ చేశారు. మరోవైపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొత్తగా నలుగురికి కేబినెట్ లో చోటు కల్పించడానికి ప్రభుత్వం సిద్దం అయింది.

వీరితో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సైతం భర్తీ చేయనున్నట్టు సమాచారం. ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news