మంచి పోషక విలువలు ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవడం ఎంత అవసరమో సరైన పద్ధతిలో ఆహారాన్ని తీసుకోవడం కూడా అంతే అవసరం. ఈ మధ్యకాలంలో చాలా శాతం మంది డైనింగ్ టేబుల్ వినియోగాన్ని తగ్గించి నేల మీద కూర్చొని భోజనాన్ని చేస్తున్నారు. అయితే పెద్దలు ఇదే పద్ధతిని పాటిస్తూ వచ్చారు. ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే కాకుండా ఎంతో ఆరోగ్యకరమైన అలవాటు అని నిపుణులు చెబుతున్నారు. కేవలం డైనింగ్ టేబుల్ మాత్రమే కాకుండా ఎన్నో ఫంక్షన్లలో నిల్చుని చేతిలో ప్లేట్ పట్టుకొని భోజనాన్ని చేస్తున్నారు.
అటువంటి బఫెట్ సిస్టం వలన మంచి అలవాట్లు తగ్గిపోతున్నాయి. దానివలన ఎన్నో ప్రయోజనాలను నష్టపోతున్నారు అనే చెప్పవచ్చు. కింద కూర్చొని భోజనం చేయడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. ఎప్పుడైతే కింద కూర్చుని భోజనం చేస్తారో కడుపు మీద తక్కువ ఒత్తిడి పడుతుంది. దీంతో జీర్ణ ప్రక్రియ ఎంతో సులభంగా కొనసాగుతుంది. ఈ విధంగా ఆహారం త్వరగా జీర్ణం అవ్వడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా నేల మీద కూర్చొని తినడం వలన ప్రేగులు, నాళాల పై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీని వలన మలబద్ధకం వంటి సమస్యలు పూర్తిగా తగ్గుతాయి.
సాంప్రదాయాల ప్రకారం కింద కూర్చుని భోజనం చేయడం వలన కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడపవచ్చు. ఈ విధంగా కుటుంబ సభ్యుల మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఆరోగ్యంతో పాటుగా బలమైన బంధాలను కూడా పొందవచ్చు. కింద కూర్చుని భోజనం చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు తినే ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. కింద కూర్చుని తినేటప్పుడు మోకాళ్లు, తొడ, కండరాలు శక్తివంతంగా పనిచేస్తాయి మరియు రక్త ప్రసరణ బాగుంటుంది. ఎక్కువ రక్త ప్రసరణ అవ్వడం వలన వెన్నుముక సరిగ్గా ఉంటుంది, మంచి పోస్టర్ కూడా ఏర్పడుతుంది.