చాలా శాతం మంది బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కూడా ఉపవాసాన్ని చేస్తూ ఉంటారు. అయితే, ఆహారాన్ని రాత్రి సమయంలో తీసుకోవడం లేక పండ్లు, పండ్ల రసాలను లేక తేలికపాటి ఆహారాన్ని తీసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. ఉపవాసాన్ని కేవలం పండుగలకు లేక పూజలు వంటివి చేసినప్పుడు మాత్రమే కాక వారానికి ఒక రోజు ఉపవాసాన్ని చేస్తే ఆరోగ్యం ఎంతో మెరుగ్గా ఉంటుంది. మరికొందరు పూర్తిగా ఆహారాన్ని తీసుకోకుండా కేవలం మంచి నీటిని తీసుకొని ఉపవాసాన్ని చేస్తూ ఉంటారు. దీన్నే వాటర్ ఫాస్టింగ్ అంటారు. ఎప్పుడైతే రెండు రోజులు పాటు పూర్తిగా వాటర్ డైట్ ను చేస్తారో, ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అని నిపుణులు చెబుతున్నారు.
రెండు రోజులు పాటు కేవలం మంచినీటిని తీసుకుంటే, శరీరంలో పేరుకుపోయిన కొవ్వు శక్తిగా పనిచేస్తుంది. దీంతో బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా శరీరం నుండి హానికరమైన మలినాలు కూడా బయటకు తొలగిపోతాయి. మంచినీటిని తీసుకొని వాటర్ ఫాస్టింగ్ చేస్తే, మెదడు ఎంతో చురుకుగా పనిచేస్తుంది. పైగా, ఒక రోజు పూర్తిగా వాటర్ ఫాస్టింగ్ ను పూర్తి చేసిన తర్వాత రెండో రోజు నుండి శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది.
దీంతో ఊబకాయం వంటి ఎన్నో సమస్యలు తగ్గుతాయి. వాటర్ ఫాస్టింగ్ చేస్తే, ఆహారాన్ని తీసుకోకపోవడం వలన అలసటగా భావించవచ్చు. మీ ఆరోగ్య పరిస్థితులు మరియు వర్క్ లోడ్ ప్రకారం దీనిని పాటించాలి. కనుక మీరు వాటర్ డైట్ చేయడానికి ముందు వైద్యుల నుండి సలహాలు తీసుకోవడం ఎంతో అవసరం. వాటర్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు గోరువెచ్చని నీటిని తరచుగా తీసుకుంటూ ఉండాలి మరియు ఎక్కువ రోజులు పాటుగా ఈ ఫాస్టింగ్ ను చేయకూడదు అని గుర్తుంచుకోవాలి.