పూజలకు ఎక్కువగా ఉపయోగించే తమలపాకు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి ఇది మంచి పరిష్కారం చూపిస్తుంది. అయితే తమలపాకు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు మనం చూద్దాం..!
ఆకలిని పెంచుతుంది:
నోటికి రుచి అనిపించకపోయినా తినాలని అనిపించలేనప్పుడు రెండు తమలపాకులు నమిలితే ఆకలి వేస్తుంది. కాబట్టి ఆకలి వేయకపోతే రెండు తమలపాకులు నమిలితే చాలు.
బ్లోటింగ్ ని పోగొడుతుంది:
నీళ్ళు ఎక్కువగా ఉండి కడుపు ఉబ్బరంగా అనిపిస్తే రెండు తమలపాకులు తీసుకుని చేతితో నలిపి వాటిని పాలలో కలుపుకుని తాగితే బ్లోటింగ్ సమస్య చిటిక లో తగ్గిపోతుంది. దీనితో మీకు ఉపశమనం కలుగుతుంది.
తల నొప్పిని తగ్గిస్తుంది :
కొందరికి తలనొప్పి అప్పుడప్పుడు వస్తుంటుంది. తలనొప్పికి కానీ మైగ్రైన్ కి కానీ ఇది ఔషధంలా పని చేస్తుంది. దీని కోసం మీరు నుదుటి మీద తమలపాకులుని రాయండి లేదు అంటే తమలపాకుల రసం తో కాసేపు మసాజ్ చేయండి. దీని వల్ల మీకు సులువుగా తలనొప్పి లేదా మైగ్రేన్ నొప్పి తగ్గిపోతాయి.
డిప్రెషన్ ని తరిమికొడుతుంది :
రోజు తమలపాకులు తీసుకుంటూ ఉంటే మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది. అలానే డిప్రెషన్ ని కూడా మీరు దూరం చేయవచ్చు.
మజిల్ టెన్షన్ ని తగ్గిస్తుంది:
తమలపాకు మజిల్ టెన్షన్ ని కూడా పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె తో కలిపి దీని కాళ్లు, వీపు దగ్గర పట్టిస్తే నొప్పి, వాపు మంటలు తొలగిపోతాయి.
అరుగుదలకు ఉపయోగపడుతుంది:
అరుగుదలకు తమలపాకు మేలు చేస్తుంది. అరుగుదలకు సహకరించే యాసిడ్స్ జీర్ణకోశం లో ఉత్పత్తి అవడానికి తమలపాకు సహకరిస్తుంది. కాబట్టి తమలపాకులు తీసుకుని అరుగుదల సమస్య తగ్గించుకోండి.
నొప్పిని తొలగిస్తుంది:
ఎప్పుడైనా చిన్న గాయాలు, వాపు, నొప్పి కలిగితే తమలపాకులని నొప్పి ఉన్న చోట ఉంచండి. దీనితో సమస్య తగ్గిపోతుంది.
దగ్గుని తగ్గిస్తుంది:
తమలపాకులు తీసుకోవడం వల్ల కఫం రాకుండా ఉంచుతుంది. దీనితో మీకు దగ్గు కూడా రాదు.