విజయవాడ వర్గపోరు నేపథ్యంలో అధిష్టానం చర్యలు ప్రారంభించింది..ఇప్పటికే చంద్రబాబు సూచనలతో ముగ్గురు నేతలతో అచ్చెన్నాయుడు మాట్లాడినట్లు తెలుస్తోంది.. అంతేకాక బోండా ఉమా ఇంటికి విజయవాడ మేయర్ అభ్యర్థి శ్వేతా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇంటికి వెళ్ళి తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా బోండా ఉమా, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలను కోరే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద వివాదానికి ముగింపు పలికే దిశగా అధిష్టానం చర్యలు ప్రారంభించింది అని చెప్పవచ్చు.
అయితే రేపు చంద్రబాబు రోడ్ షో లో నేతలు పాల్గొనే విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. అచ్చెన్నాయుడు కచ్చితంగా రేపు రోడ్ షోలో హాజరు కావాలని ముగ్గురు నేతలను ఆదేశించినట్లు చెబుతున్నారు. అయితే మరి ఆ ముగ్గురు నేతలు పాల్గొంటారా పాల్గొనరా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే దీనికి సంబంధించి కేశినేని నాని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తనకు పార్టీలో ఎవరితో విభేదాలు లేవని చంద్రబాబు చెప్పిందే వేదం అన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.