బార్లీ వాటర్ అధికంగా తీసుకుంటున్నారా!. ఈ సైడ్ ఎఫెక్స్ ఎటాక్ చేస్తాయి జాగ్రత్త

-

బార్లీ గింజలతో టీ చేసుకుంటారు. ఇంకా నీళ్లు కూడా తాగుతారు. ఇది ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందించినప్పటికీ.. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటున్నాయి. బార్లీ వాటర్ తాగటం వల్ల లాభాలు ఉంటాయి అనే తెలుసు కానీ, చాలామందికి వీటి వల్ల ఎదురయ్యో దుష్ప్రభావాల గురించి ఐడియా ఉండదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

 

కడుపులో సమస్యలు: బార్లీ నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో ఇబ్బందిగా ఉంటుంది బార్లీ నీరు కడుపు నొప్పికి దారితీస్తాయి. వివిధ రకాల సమస్యలకు వాడే కొన్ని మందులతో కలయిక వల్ల కడుపులో చికాకు, నొప్పి, తిమ్మిరి, ఉబ్బరం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అతిసారానికి కూడా ఇది కారణం కావొచ్చు.

మలబద్ధకం: ఎక్కువగా బార్లీ నీటిని తాగితే, దీర్ఘకాలిక మలబద్ధకం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమస్య 7 రోజుల కంటే ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించటం మంచిది.

రెక్టల్ బ్లీడింగ్: మలబద్ధకం ఎక్కువ అయితే.. మలంలో రక్తస్రావం కలిగే అవకాశాలు ఉంటాయి. అటువంటి పరిస్థితులను నివారించడానికి బార్లీ నీటిని పెద్దమొత్తంలో తీసుకోకుండా ఉండటమే బెటర్.

గ్యాస్ సమస్య: పేగులో గ్యాస్ కి కారణం కావచ్చు. పెద్ద పేగులో ఉండే బ్యాక్టీరియా ఈ గ్యాస్ సమస్యకు కారణ మవుతుంది.. కాబట్టి గ్యాస్ ఏర్పడకుండా ఉండాలంటే బార్లీ నీటిని మితంగా తీసుకోవటమే మంచిది.

ఫంగల్ కాలుష్యం: బార్లీ నీరు తాగటం వల్ల కొన్ని సందర్భాల్లో వాటిల్లో ఉండే ఫంగల్ కలుషితానికి దారితీస్తుంది. బార్లీ నీటి సారంలో కనిపించే కొన్ని కలుషితాలు ట్రైకోథెసియం రోజియం ,ఓక్రాటాక్సిన్ A (4), (5). వంటి టాక్సిన్స్ మన ఎముకలను బలహీనపరిచి దెబ్బతీస్తాయట.

అలెర్జీ సమస్యలు ; బార్లీ నీటిని తాగటం వల్ల కొన్ని రకాల అలెర్జీ సమస్యలు వస్తాయి. హైపర్‌సెన్సిటివిటీ లేదా అలర్జీతో బాధపడుతుంటే, రోజువారీగా బార్లీ నీటిని తాగకపోవటం మంచిది. లేదంటే దద్దుర్లు, మంట, చికాకు,కళ్ళు, కనురెప్పలు, ముక్కు, చేతులు, కాళ్లు భాగాల్లో అలర్జీ సమస్యలను ఎదుర్కోక తప్పదు.

ఆస్తమా : బార్లీ పిండి తీవ్రమైన శ్వాసకోశ అలెర్జీని కలిగిస్తాయి. బార్లీ నీటిని తయారుచేసేటప్పుడు బార్లీ పిండిని ఎక్కువగా తీసుకుంటే శ్వాసకోశ అలర్జీలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి.

అన్నవాహికు నష్టం: ఫైబర్‌తో నిండిన బార్లీ అన్నవాహికకు హాని కలిగిస్తుంది. బార్లీ పానీయాన్ని సిద్ధం చేసినప్పుడల్లా దానికి తగినంత నీటిని చేర్చుకోవటం మంచిది. లేకపోతే మింగడంలో ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరికి అన్నవాహికకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి.

సెలియక్ వ్యాధి: బార్లీలోని గ్లూటెన్ కారణంగా ఉదరసంబంధిత వ్యాధులకు కారణమయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. బార్లీలో పెద్ద మొత్తంలో గ్లూటెన్ ఉంటుంది.

బ్లడ్ షుగర్ ; బార్లీ నీటిని అధికంగా తీసుకోవడం వల్ల మీ రక్తప్రవాహంలో చక్కెర పరిమాణం తగ్గే అవకాశం ఉంది. ఇది సాధారణ స్థాయికి వెళితే హైపోగ్లైసీమియాకు కారణమవుతుంది. బార్లీ నీటిని తాగేటప్పుడు మీ బ్లడ్ షుగర్ స్థాయిని నిశితంగా గమనించుకోవాలి.

శస్త్రచికిత్స సమస్యలు: బార్లీ నీరు తాగేవారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో అకస్మాత్తుగా పడిపోయే అవకాశాలు ఉంటాయి. శస్త్రచికిత్స చేయించుకునే వారు ముందస్తుగా బార్లీ నీరు తాగేవిషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆపరేషన్ కు 15 రోజుల ముందు నుండే బార్లీ నీటిని తాగటం మానేయటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

బార్లీ వాటర్ వల్ల చాలా లాభాలు ఉన్నప్పటికీ.. ఎక్కువగా తీసుకోవడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి డాక్టర్ సిఫారసు మేరకు రోజుకు ఎంత పరిమాణంలో తీసుకోవాలో తెలుసుకుని ఆ క్యాంటిటీలోనే తాగడం మంచిది. మన ఆరోగ్య పరిస్థితులను బట్టి వారానికి ఎన్నిసార్లు తాగాలో కూడా వైద్యులు నిర్ణయిస్తారు. ఎలాంటి వైద్యుల సలహా లేకుండా మాత్రం బార్లీ వాటర్ కోటర్ తాగినట్లు తాగడం మంచిది కాదు.!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version