రాత్రిపూట అరటిపండు తినొచ్చా..? తింటే ఏం అవుతుంది..?

-

కొన్ని ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట అరటి పండ్లు తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. రాత్రిపూట అరటి పండ్లు తీసుకోవచ్చా..? తింటే ఏమవుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రిపూట అరటి పండ్లు తినొచ్చు. దీని వలన మంచి నిద్ర పడుతుంది. పైగా ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. రాత్రిపూటైనా అరటి పండ్లు తీసుకోవచ్చు. మంచి నిద్ర పట్టి హాయిగా ఉంటుంది.

పొటాషియం అరటిపండ్లలో ఎక్కువగా ఉంటుంది. కండరాల నొప్పులు, క్రామ్ప్స్ వంటివి తగ్గుతాయి. మజిల్స్ రిలాక్స్డ్ గా ఉంటాయి. బీపీ కూడా అరటిపండు తీసుకోవడం వలన కంట్రోల్ అవుతుంది. ఒత్తిడి కూడా తగ్గి ఆరోగ్యంగా ఉండొచ్చు. అరటిపండ్లలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. యాంగ్జైటీ కారణంగా నిద్రలేమి వంటి సమస్యలను నయం చేసుకోవచ్చు. అరటిపండ్లలో ట్రిప్టోఫ్యాన్ ని సెరోటోనిన్ గా మార్చేందుకు హెల్ప్ చేస్తుంది. దీంతో శరీరానికి చక్కటి ప్రయోజనాలు ఉంటాయి.

అరటిపండు రాత్రి తీసుకోవడం వలన మనిషికి మనిషికి కొన్ని మార్పులు ఉంటాయి. కొందరికి దీని వలన లాభం ఉంటే కొంతమందికి సమస్యగా ఉండొచ్చు. శ్లేష్మం ఉత్పత్తి అయి జలుబు చేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఉదయం తీసుకోవడం మంచిది. అరటిపండు తొక్కతో టీ తయారు చేసుకునే తాగచ్చు. డయాబెటిస్ ఉంటే ఈ పండును తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య నిపుణులు సలహా తీసుకుంటే మంచిది. రాత్రిపూట తింటే సమస్యలు ఏమైనా వస్తున్నాయా లేదో చెక్ చేసుకుని అప్పుడు తినండి. కొంతమందికి జలుబు ఎక్కువగా చేస్తూ ఉంటుంది. అలాంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఒకవేళ కనుక జలుబు వంటివి రాకపోయినట్లయితే రాత్రి పూట తీసుకోవచ్చు అలాంటప్పుడు మంచి నిద్ర పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news