బిజేపీ ఆపరేషన్ -2028 వర్కౌట్ అవుతుందా..? కీలక నేతలు టచ్ లో ఉన్నారా..?

-

తెలంగాణాలో బిజేపీ క్రమక్రమంగా బలోపేతం అవుతోంది.. ఓటు షేర్ ను గణనీయంగా పెంచుకుంటోంది.. ఈ క్రమంలో తెలంగాణాలో కాషాయం జెండా పాతాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యింది.. ఇందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.. సామాజిక సమీకరణలతో యుద్దం చెయ్యాలని ఆ పార్టీ భావిస్తోందట..అందుకోసం ఆపరేషన్ 2028 ప్లాన్ చేసిందనే ప్రచారం నడుస్తోంది.

గత ఎన్నికలకు ముందే కీలక నేతలను పార్టీలోకి చేర్చుకున్న బిజేపీ… కాంగ్రెస్ ధాటికి తట్టుకోలేకపోయింది.. ఈటెల రాజేంద్ర, కిషన్ రెడ్డిలాంటి సీనియర్లు ఉన్నా.. బలమైన సామాజికవర్గానికి చెందిన నేతలు లేకపోవడంతో.. కొన్ని స్థానాలకే పరిమితమైంది.. కానీ ఊహించని స్థాయిలో ఓటు షేర్ ను సంపాదించుకుంది.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తున్న ఆ పార్టీ.. చాప కింద నీరులా పొలిటికల్ స్టాటజీని ఫాలో అవుతుందన్న టాక్ వినిపిస్తోంది..

మరో నాలుగేళ్లలో తెలంగాణాలో ఎన్నికలున్నాయి.. అప్పుడు అధికారంలోకి రావడమే లక్ష్యంగా.. ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ రెఢీ చేస్తున్నారట.. కమలం పార్టీ అగ్రనేతలు ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది..సామాజిక సమీకరణలతో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న కమలనాథులు… తెరచాటుగా మంత్రాంగం నడుపుతూ ప్రత్యర్థులను దెబ్బతీయాలని వ్యూహం రచిస్తున్నట్లు చెబుతున్నారు.

ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణను బీజేపీలో చేర్చుకోవాలనేది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్న ఆయన.. పార్టీలో చేరుతారా లేదా అనేది ఆసక్తికంగా మారింది.. ఆయనతో పాటు.. రాజ్యసభ సభ్యులు, బీసీ నేత ఆర్ కృష్ణయ్యతో కూడా బిజేపీ టచ్ లో ఉందనే టాక్ వినిపిస్తోంది.. వీరిద్దరిని అక్కున చేర్చుకుంటే తెలంగాణాలో అధికారం ఖాయమనే భావనలో ఆ పార్టీ ఉంది.. అవి వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news