రోజూ నీరాని తాగచ్చా..? తాగితే ఏం అవుతుంది..?

-

నీరా కేఫ్: తెలంగాణ ప్రభుత్వం నీరా కేఫ్ ని హైదరాబాదులో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 20 కోట్ల వ్యయం తో దీనిని నిర్మించారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి పది గంటల వరకు తెరిచి ఉంచుతారు ఈ కేఫ్ ని. నీరాతో పాటుగా ఈ కేఫ్ లో హనీ, ఐస్ క్రీమ్లు, షుగర్, నీరా బూస్ట్ వంటివి లభిస్తాయి. అయితే నీరాకి సంబంధించి చాలా మందిలో ఎన్నో సందేహాలు ఉన్నాయి. నిజానికి నీరా వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈత తాటి ఖర్జూర చెట్ల నుండి తీసే నీరా చాలా రుచిగా ఉంటుంది.

నీరా కేఫ్

చూడడానికి కొబ్బరి నీళ్లలాగే ఉంటుంది రుచి కూడా కొంచెం కొబ్బరి నీళ్ల లాగే ఉంటుంది. పులియబెడితే కల్లు లాగా అయిపోతుంది. సూర్యోదయం అవ్వకుండానే దీన్ని సేకరిస్తారు అయితే కల్లులో మత్తుని ఇచ్చే లక్షణాలు ఉంటాయి కానీ దీనిలో మాత్రం అటువంటి లక్షణాలు ఏమి కూడా ఉండవు. ఆల్కహాల్ కంటెంట్ శాతం ఇందులో సున్నా. అయితే నీరాని ఎవరైనా సరే తీసుకోవచ్చు పిల్లలైనా కూడా తీసుకోవచ్చు. కొబ్బరినీళ్లు లాగే మనం దీన్ని కూడా తీసుకోవచ్చు రకరకాల ఆరోగ్య ప్రయోజనాలని నీరా ద్వారా పొందొచ్చు.

నీరా లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కంటి ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. చర్మ ఆరోగ్యానికి కూడా నీరా చాలా ఉపయోగపడుతుంది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుండి చర్మాన్ని రక్షిస్తుంది నీరా. రక్త పోటు ని తగ్గించడానికి కూడా నీరా హెల్ప్ అవుతుంది. రక్తనాళాల నుండి ఒత్తిడిని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. నీరాలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది.

రోజూ తీసుకోవచ్చు. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. తేనెలో అయితే గ్లైసెమిక్ ఇండెక్స్ 55 ఉంటుంది పంచదారలో 70 ఉంటుంది చెరుకులో 68 ఉంటుంది అయితే నీరలో గ్లైసెమిక్ ఇండెక్స్ కేవలం 35 మాత్రమే ఉంటుంది. కాబట్టి రోజూ తీసుకోవచ్చు ముఖ్యంగా షుగర్ పేషెంట్లు తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది నీరా సహజసిద్ధమైన హెల్త్ డ్రింక్. శక్తినిచ్చే ఎనర్జీ డ్రింక్ గానే కాదు జీర్ణ సంబంధిత సమస్యల్ని కూడా దూరం చేస్తుంది ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version