నిత్యం వాకింగ్ చేయడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వాకింగ్ వల్ల అధిక బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే పలు ఇతర లాభాలు కూడా కలుగుతాయి. అయితే చాలా మంది వాకింగ్ చేసేందుకు కనీసం 30 నిమిషాల సమయం కూడా మాకు దొరకడం లేదని చెప్పి వాపోతుంటారు. అలాంటి వారు కనీసం 12 నిమిషాలు అయినా వాకింగ్ చేస్తే చాలట. దాంతో పలు లాభాలు ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది.
లోవా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రకారం.. నిత్యం కనీసం 12 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేస్తే చాలట. దీంతో మన శరీరంలపై అది పాజిటివ్ ఎఫెక్ట్‌ను చూపిస్తుందట. అలా వాకింగ్ చేయవం వల్ల డిప్రెషన్ తగ్గుతుందట. ఇతర మానసిక సమస్యలు పోయి, సంతోషంగా ఉంటారట.
నిత్యం కనీసం 12 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేస్తే ఒత్తిడి చాలా తగ్గుతుందని సైంటిస్టులు అంటున్నారు. నిత్యం మనం అనేక సందర్భాల్లో లోనయ్యే ఒత్తిడి నుంచి బయట పడాలంటే వాకింగ్ చేయాలని వారు చెబుతున్నారు. అలాగే శారీరక ఆరోగ్యం కూడా మెరుగు పడుతుందని సైంటిస్టులు అంటున్నారు. కనుక వాకింగ్ చేసేందుకు టైం లేదని అనేవారు.. కనీసం 12 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేసేందుకు ట్రై చేయండి. మంచి లాభాలు ఉంటాయి.