‘క్యారెట్ జ్యూస్’తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

-

క్యారెట్ అంటే చాలామంది ఇష్టపడని తింటుంటారు. చూడగానే తినాలనిపిస్తుంది. దీనిని వంటలో వేసుకోని తినడం కంటే పచ్చిగా తినడానికే చాలా ఆసక్తి చూపిస్తుంటారు. క్యారెట్ తినడం వల్ల ఎంతో మంచిదని వైద్యులు చెబుతున్నారు. పచ్చిగా తినడానికి ఇష్టపడని వారు వాటిని జ్యూస్ రూపంలో లేదా స్వీట్స్ రూపంలో తినవచ్చు. క్యారెట్ జ్యూస్ ను రోజు ఒక గ్లాస్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆ ప్రయోజనాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

క్యారెట్లో ఉండే సుగుణాలు బహుశా ఇంకో వెజిటేబుల్ లో ఉండవేమో. ఇందులో విటమిన్ ఎ, బి, సి, ఇ లతో పాటు ఐరన్, మెగ్నీషియం, సోడియం వంటి మూలకాలు మెండుగా ఉన్నాయి. ఇది మన శరీరాన్ని అనేక రుగ్మతల నుండి కాపాడటమే కాకుండా, ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచే గుణాలున్నాయి అందాన్ని పెంచే గుణాలున్నాయి.

క్యారెట్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సహజంగా క్యారెట్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది కళ్ళకు మంచిదని. ఇందులో ఉన్న ‘విటమిన్ ఎ’ కంటి చూపును మెరుగు పరచడంతో పాటు అనేక కంటి సమస్యలను దూరం చేస్తూ రేచీకటి రాకుండా నివారిస్తుంది.

క్యారెట్లో ఉండే విటమిన్ వ్యాధి నిరోధక శక్తిని మెరుగు పరచడమే కాకుండా క్యాన్సర్ వంటి వ్యాధులను నివారిస్తుంది.

క్యారెట్ మన జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రోజు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ గ్లాస్ తీసుకోవడం వల్ల మనకు వెంట్రుకల కుదుళ్ల నుంచి గట్టిపడతాయి. అలాగే ఎటువంటి జుట్టు సమస్యలు లేకుండా వెంట్రుకలు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.

క్యారెట్లో ఉండే విటమిన్ ఇ మీ చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. శరీరంపై ఏర్పడే మృతకణాలను పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కాంతి వంతమైన చర్మం మీ సొంతమవుతుంది. అలాగే మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.

రోజూ క్యారెట్ తీసుకోవడం వల్ల మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, రుతుక్రమ సమస్యలు నుండి రుతుక్రమ సమస్యలను దూరం చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version