చూయింగ్ గ‌మ్‌లు ఎక్కువ‌గా న‌ములుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

-

ముఖానికి వ్యాయామం అవుతుంద‌ని కొంద‌రు.. స‌ర‌దాగా కొంద‌రు.. అల‌వాటు ప్ర‌కారం ఇంకొంద‌రు.. త‌రచూ చూయింగ్ గ‌మ్‌ల‌ను న‌ములుతుంటారు. అయితే చూయింగ్ గమ్‌లు నిజానికి మ‌న‌కు తీవ్ర‌మైన దుష్ప‌రిణామాల‌ను క‌లిగించ‌వ‌ని ఇప్ప‌టి వ‌ర‌కు భావిస్తూ వ‌చ్చారు. కానీ అది నిజం కాద‌ని.. చూయింగ్ గ‌మ్‌ల వ‌ల్ల మ‌న పేగుల్లో స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డిస్తున్నాయి.

chewing gums may interfere with the absorption of nutrients by intestines

యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌కు చెందిన కొంద‌రు ప‌రిశోధ‌కులు చూయింగ్ గ‌మ్‌ల‌ను న‌మిలే కొంద‌రిపై ప‌రిశోధ‌న‌లు చేశారు. చూయింగ్ గ‌మ్‌ల‌లో ఉండే టైటానియం డ‌యాక్సైడ్ అన‌బ‌డే ఓ ర‌సాయ‌నిక స‌మ్మేళ‌నం మ‌న పేగులకు స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడుతుంద‌ని ఆ సైంటిస్టులు తేల్చారు. స‌ద‌రు ర‌సాయ‌నం వ‌ల్ల పేగులు మ‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాలను స‌రిగ్గా గ్ర‌హించ‌లేవ‌ని నిర్దారించారు.

చూయింగ్ గ‌మ్‌ల‌ను ఎక్కువ‌గా న‌మిలే వారిలో పోష‌కాహార స‌మ‌స్య‌లు వ‌స్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ గ‌మ్‌ల‌లో ఉండే టైటానియం డ‌యాక్సైడ్ వల్ల పేగులు మ‌నం తినే ఆహారంలో ఉండే ఐర‌న్‌, జింక్‌, ఫ్యాటీ యాసిడ్లు త‌దిత‌ర పోష‌కాల‌ను గ్ర‌హించ‌లేవ‌ని చెబుతున్నారు. క‌నుక చూయింగ్ గ‌మ్‌ల‌ను తినేవారు వాటికి దూరంగా ఉంటే మంచిద‌ని సైంటిస్టులు స‌ల‌హా ఇస్తున్నారు..!

Read more RELATED
Recommended to you

Latest news