మాంసాహార ప్రియులకు తినేందుకు అనేక రకాల మాంసాహారాలు అందుబాటులో ఉన్నాయి. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు.. ఇలా రక రకాల మాంసాహారాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా మంది చికెన్, మటన్‌లను తినేందుకే అధిక ప్రాధాన్యతను ఇస్తుంటారు. అయితే అసలు మనం ఏది తినాలి ? చికెన్, మటన్‌లలో మనం తింటే మంచిది ? వేటి ద్వారా మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్..
చికెన్‌లో కొవ్వు తక్కువగా ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే చికెన్‌ను స్కిన్‌తో తింటే కొవ్వు ఎక్కువగా లభిస్తుంది. అందువల్ల చికెన్‌ను ఎప్పుడూ స్కిన్ లేకుండానే తినాలి. కండరాల సమస్యలు ఉన్నవారు, జిమ్ చేసే వారు, శారీరక శ్రమ చేసే వారు ఎక్కువగా చికెన్ తింటే మంచిది. అలాగే చికెన్‌ను ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెలో వండుకుని తింటే ఇంకా మంచిది.
మటన్…
మటన్ లో కొవ్వు, కొలెస్ట్రాల్, ప్రోటీన్లు ఎక్కువగానే ఉంటాయి. అయితే మటన్ ఎంత లేతగా ఉంటే అంత మంచిది. లేత మటన్‌లో కొవ్వు తక్కువగా ఉంటుంది. అది ఆరోగ్యానికి మంచిది. రక్తహీనత సమస్య ఉన్నవారు, హైబీపీ, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు లేత మటన్ తినాలి. లేత మటన్ చికెన్ కన్నా మంచిది. కిడ్నీ వ్యాధిగ్రస్తులు చికెన్ ఎక్కువగా తినరాదు. ఎందుకంటే అందులో సోడియం ఎక్కువగా ఉంటుంది. అలాగే వారు చేపలు, ఇతర సీ ఫుడ్‌ను కూడా తినరాదు. వాటిల్లోనూ సోడియం పరిమాణం ఎక్కువగానే ఉంటుంది. కనుక వారు మటన్‌ను తీసుకోవచ్చు.
ఇక చికెన్, మటన్‌లు కాకుండా మనలో చాలా మందికి చేపలంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. అయితే కిడ్నీ వ్యాధులు ఉన్నవారు చేపలకు దూరంగా ఉండాలి. వాటిలో ఉండే సోడియం వల్ల కిడ్నీలు ఇంకా ఎక్కువగా ఒత్తిడికి గురయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే గుండె జబ్బులు ఉన్నవారు చేపలను తినవచ్చు. వాటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు మేలు చేస్తాయి. కనుక చేపలను తింటే గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.