70 ఏళ్ళ వయసులో రజినికాంత్ సాహసాలు చూసారా….??

-

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన దర్బార్ సినిమాతో యావరేజ్ విజయాన్ని అందుకున్నారు. ఆదిత్య అరుణాచలం అనే మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజిని నటించిన ఈ సినిమాకు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో రజిని తన మార్క్ పెర్ఫార్మన్స్ తో ఫ్యాన్స్ ని అలరించినప్పటికీ, దర్శకుడు మురుగదాస్ మాత్రం ప్రేక్షకులు ఆశించే రేంజ్ లో మాత్రం సినిమా తెరకెక్కించలేదని కొంత విమర్శలు ఎదురయ్యాయి. ఇక ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న రజిని,

ఇటీవల డిస్కవరీ ఛానల్ లో ఎంతో ప్రఖ్యాతి గాంచిన షో అయిన మ్యాన్ vs వైల్డ్ షో లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. తొలిసారిగా ఈ షో ద్వారా టెలివిజన్ తెరపై కనిపించి కనువిందు చేయనున్న రజిని, మొన్న చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, ఆ షో కొంత సాహసోపేతమైనదని, అయితే ఆ షో షూట్ కోసం తాను కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు రజినీకాంత్. అలానే ఈ విధంగా తొలిసారిగా బుల్లితెరపై అడుగుపెడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని, ఆ విధంగా తన అభిమానులకు మరింత చేరువ కావచ్చని అన్నారు.

 

ఇక రజినీకాంత్ తో కలిసి నిన్న ప్రారంభం అయిన మ్యాన్ vs వైల్డ్ లేటెస్ట్ ఎపిసోడ్ తాలూకు ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసిన బేర్ గ్రిల్స్, తనకు బరాక్ ఒబామా, నరేంద్ర మోడీ తరువాత రజిని గారితో పని చేయడం ఎంతో ఆనందంగా ఉందని, రాబోయే రోజుల్లో ఈ షో మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుందని పోస్ట్ చేయడం జరిగింది. కాగా నిన్న ప్రారంభం అయినా ఈ షో తాజా ఎపిసోడ్, మరికొద్దిరోజుల్లో డిస్కవరీ లో ప్రసారం కానుంది. కాగా ఈ షో కోసం అలానే 70 ఏళ్ళ వయసులో రజిని ఎటువంటి సాహసాలు చేసి ఉంటారు అనే దానిపై ఆయన ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు….!!

Read more RELATED
Recommended to you

Latest news