ఈ దుంపల్లో ఎన్ని పోషకాలో.. అస్సలు మిస్ కాకండి..

-

చిలగడ దుంపలు తెలుసు కదా.. సాధారంగా ఈ చిలగడ దుంపల్ని ఉడికించి తింటుంటాం. కొందరు కూరల్లోనూ వాడుతుంటారు. అయితే దుంపల వల్ల బరువు పెరుగుతారనే ఒక అపోహ ఉంది. ఈ కారణంతో ఈ మధ్య చాలామంది ఈ చిలగడ దుంపలను దూరంగా ఉంచుతున్నారు.

కానీ ఈ చిలగడ దుంపలు ఆరోగ్యపరంగా చాలా మంచివి. వీటిలో చాలా పోషకాలు ఉన్నాయి. వీటిలో విటమిన్-ఎ, సి, బి6, నియాసిన్, మాంగనీస్, పొటాషియం , పాంటోథెనిక్ ఆమ్లం, కాపర్… వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇంకా వీటిల్లో పుష్కలంగా ఉండే పీచూ, యాంటీ ఆక్సిడెంట్లూ పొట్టలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరిగేలా చేస్తాయి.

అంతే కాదు. క్యాన్సర్ రాకుండా కాపాడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులోని ఆంథోసైనిన్లు అధ్యయన శక్తినీ జ్ఞాపక శక్తిని కూడా పెంచుతాయట . అందువల్ల వృద్దులు వీటిని తీసుకుంటే. వృద్దాప్యంలో వచ్చే మతిమరపునీ తగ్గిస్తాయనీ హార్వర్డ్ పరిశోధకులు చెబుతున్నారు.

ప్రత్యేకించి నారింజ రంగు చిలగడ దుంపల్లోని విటమిన్-ఎ కంటి ఆరోగ్యానికి తోడ్పడటంతో బాటు రోగనిరోధకశ క్తిని పెంచుతుందట. వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే బీపీ, మధుమేహం కూడా నియంత్రణలో ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే ఇంకా ఈ దుంపల్ని దూరం పెట్టకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version