పొన్నగంటి కూరతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్ తెలుసా.?

-

ఆకుకూరలంటే..మనకు తెలిసినవి ఎక్కువగా..తోటకూర, బచ్చలకూర, పాలకూర, ఇంకా చుక్కకూర. చాలా తక్కువమందికి తెలిసి ఉంటుందేమో పొన్నగంటి కూర గురించి. బురదలో పుట్టే తామర పువ్వు ఎంత అందంగా ఉంటుందో..అక్కడే పెరిగిన ఈ పొన్నగంటి కూర అంత ఆరోగ్యానికి మంచిని చేకూరుస్తుంది. పొన్నగంటి కూర ఆకులు ఏడాది పొడవునా లభిస్తాయి. అయితే ఆకుకూరలతో పప్పు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది..కానీ ఈ కూర పప్పులో వేయటం కంటే..వేయించి తినటం వల్లే మంచి ప్రయోజనాలు చేకూరుతాయట. ఒకసారి కూర చేశాక పదే పదే వేడి చేయకూడదు. వికారానికి దారి తీసే ప్రమాదం ఉంది.

పొన్నగంటిలో పోషక విలువలు

పొన్నగంటి కూర ఆకుల్లో ఆరోగ్యానికి మేలు చేసే బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్లు సి, ఎలు ఉన్నాయి. ఇంకా విటమిన్ ‘ఎ’, ‘బి6’, ‘సి’, ఫొలేట్, ‘రైబోఫ్లెవిన్’, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం దీని నుంచి సమృద్ధిగా దొరకుతాయి.

ఈ ఆకు వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో చూసేద్దాం:

  • బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకు కూరను తరచూ తింటే మంచిది.
  • ఇందులో కొలెస్ట్రాల్ ఉంటుంది. తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి.
  • రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి.
  • ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది.
  • ఈ ఆకులో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది.
  • ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి.
  • గౌట్ వ్యాధి, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి.
  • జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఔషధ చికిత్సగా ఉపయోగిస్తారు.

భారతీయ వైద్య గురువులు చెప్పిన దాని ప్రకారం పొన్నగంటి కూర ఆకులు కనక.. నలభై ఎనిమిది రోజులు తింటే, కీలకమైన ఖనిజాలు, పోషకాల అధిక కంటెంట్‌ను అందిస్తుందని, ఇది కళ్ళను పోషించడంలో సహాయపడుతుందని, చర్మం సహజమైన సౌందర్యాన్ని కలిగిస్తుందని తెలుస్తుంది..

  • అధిక శరీర వేడి, తలనొప్పికి తగ్గటానికి పొన్నగంటి నూనె బాగా ఉపయోగపడుతుంది.
  • జుట్టుకు పోషణనిచ్చే బయోటిన్‌ దీనిలో సమృద్ధిగా ఉంటుంది.
  • ఇన్ని ఉపయోగాలు ఉన్న పొన్నగంటికూరను ఈసారి మార్కెట్‌లో దొరికితే తీసుకోండి మరీ..!

Read more RELATED
Recommended to you

Exit mobile version