చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి.. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించాలంటే ఇలా చేయండి..!!

-

ఏదైనా సరే మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది అని గుర్తుంచుకోవాలి. అప్పుడే మనం తీసుకునే ఆహారంలో కొన్ని నియమ నిబంధనలు పాటిస్తాము. లేకపోతే శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడం, గుండె సమస్యలు, డయాబెటిస్, బిపి ఇలా ఎన్నో సమస్యలను కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే గుండె ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక చెడు కొలెస్ట్రాల్ లేకుండా రక్త ప్రవాహం సాఫీగా జరిగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండే కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోవడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.

ముందుగా పిస్తా.. ప్రతిరోజు మూడు పిస్తా పప్పులు తినడం వల్ల ఎక్కువ పోషకాలు శరీరానికి లభిస్తాయి. ముఖ్యంగా ప్రోటీన్లు, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల గుండె ఆరోగ్యాన్ని పెంపొందించి అధిక బరువును దూరం చేస్తాయి. అంతేకాదు చెడు కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలోకి వస్తుంది.

బాదం.. ప్రతిరోజు ఉదయాన్నే కొన్ని నానబెట్టిన బాదంపప్పులను తినడం వల్ల వీటిలో ఉండే కరిగే ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఈ, ప్రోటీన్ వంటి పోషకాలు చెడు కొలెస్ట్రాలను దూరం చేస్తాయి. రక్త ప్రవాహం సాఫీగా జరిగేలా చేసి రక్తపోటును నియంత్రణలో నుంచి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

వాల్నట్స్ కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ముఖ్యంగా వాల్నట్స్ లో అమైనో యా, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని పెంపొందించి చెడు కొలెస్ట్రాల్ను దూరం చేయవచ్చు. ఇక కుదిరితే ప్రతిరోజు గుప్పెడు ఉడకబెట్టిన వేరుశనగ విత్తనాలను తినడం వల్ల కూడా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలాంటివి మీరు ప్రతి రోజు పాటిస్తే చెడు కొలెస్ట్రాల్ దూరం అయ్యి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version