చలికాలంలో విపరీతమైన చలిని భరించలేక మందుబాబులు తాగేదానికి కంటే ఇంకా ఎక్కువ తాగుదాం అనుకుంటారు. బాడీలో వేడిపుట్టించడానికి.. మందు ఎక్కువగా తాగుతారు. కానీ ఇది చాలా ప్రమాదకరమని, నిజానికి అలా ఏం వేడి ఉండదని తాజా అధ్యనంలో తేలింది. అసలు చలికాలంలో మద్యం తాగటం వల్ల బాడీలో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
మద్యం తాగడం వల్ల చలిని తట్టుకోవడం అనేది ఒట్టి భ్రమ అని నిపుణులు చెబుతున్నారు. చలిని తట్టుకునేలా ఒళ్లు వెచ్చబడాలంటే మద్యం సేవించాలన్నది నూటికి నూరు శాతం అబద్దపు ప్రచారం అని కొట్టిపడేశారు. మద్యం సేవిస్తున్నంతసేపు శరీరం బాగా వెచ్చబడి ఉంటుంది. కానీ కొద్ది సమయం తర్వాత శరీరం పూర్తిగా చల్లగా అవుతుంది.. దాంతో ఆల్కహాల్ చలిని తట్టుకునే శక్తిని కోల్పోతుంది.
దీనివల్ల శరీరానికి బాగా వణుకు పుట్టడం వంటివి జరగటంతో కొన్ని సందర్భాలలో గుండె పనితీరు కూడా ఆగిపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి చలికాలంలో మద్యం సేవించే వాళ్ళు ఎక్కువగా తీసుకోకుండా సరైన మోతాదులోనే తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరికొందరు ఈ సమయంలో పొగ కూడా బాగా తాగుతూ ఉంటారు. దీనివల్ల కూడా శరీరానికి వేడి కలుగుతుందని వాళ్లు అనుకుంటారు. కానీ ఇది కూడా శరీరానికి చాలా డేంజర్ అని ముఖ్యంగా చలికాలంలో దీని ప్రభావం మరింత ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
చలికాలంలో మద్యం తాగడం వలన శరీరం చల్లగా మారుతుంది. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు ఇంకా పెరుగుతాయి. ఆల్కహాల్ శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. ఒకవేళ శరీరంలోకి చేరకపోతే.. శరీర ద్రవం తగ్గుతుంది. దీంతో డీహైడ్రేషన్ సమస్య పెరుగి ఫలితంగా..శరీరంలో నుంచి చెమటగానీ, నీరు గానీ బయటకు రాదు. అందుకే ఎక్కువ నీరు తాగాల్సిన అవసరం లేదనుకుంటారు. చలికాలంలో గాలి చాలా పొడిగా ఉంటుంది. దీంతో గాలి నుంచి తేమ శరీరానికి చేరదు. చలిలో మద్యం సేవిస్తే శరీర ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయి ఆరోగ్యానికి తీరని నష్టం కలుగుతుందట.
అసలు ఈ సీజన్లో విపరీతమైన మద్యసేవనం ప్రాణాంతకం అని ఓహియో వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. మద్యం జోలికి మాత్రం వెళ్లొద్దంటూ హెచ్చరిస్తున్నారు.. వోడ్కా, విస్కీ, జిన్, వంటి మద్యాన్ని చలిలో తాగితే, ఈ పానీయాలు వెచ్చగా ఉండటానికి ఏమాత్రం సహాయపడవు. వీటివల్ల గొంతు నొప్పి లేదా తీవ్రమైన జలుబును ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ప్రాణంతకం కూడా జరగొచ్చు.
మరి ఇక చలికాలంలో మద్యం తాగొద్దా..?
శరీరం వేడెక్కటానికి, వెచ్చని గదిలో కూర్చుని మద్యం తాగవచ్చ. ఇది రక్త నాళాలను విస్తరించి.. రక్త ప్రవాహాన్ని పెంచుతుంది, కానీ గది ఉష్ణోగ్రత వద్ద అధిక ఉష్ణం వల్ల ఏమాత్రం నష్టం ఉండదు. అలా కాకుండా బయటి చలివాతావరణంలో కూర్చుని మద్యం సేవించే ప్రయత్నం ఏమాత్రం మంచిదికాదు. గదిలో మద్యం సేవించిన తరువాత చలిలో తిరిగే ప్రయత్నం కూడా చేయొద్దు. ఏదిఏమైనా..ఈ కాలంలో మద్యం తాగటం మాత్రం కాస్త తగ్గించటమే మేలని నిపుణులు అంటున్నారు.