వేసవిలో తాటిముంజులు అధికంగా తింటున్నారా.. సైంటిఫిక్ గా ఏం చెప్తున్నారంటే..!

-

ప్రకృతి ఏ కాలంలో అందించేవి ఆ కాలంలో తినడం వల్ల బాడీకీ కావాలిసిన అవసరాలు తీరతాయి. వేసివలో వేడిని తట్టుకోవడానికి నీరు లవణాలు ఎక్కువగా కావాలి. మరి అలాంటి నీరు, లవణాలు ఎక్కువగా ఉన్న ప్రకృతి ప్రసాదించిన తాటిముంజులు సమ్మర్ లోనే కదా దొరుకుతాయి. భలే విచిత్రంగా అనిపిస్తుంది కదా.. తల్లి కంటే ముందు మన అవసరాలను తెలుసుకుని ఆ టైంకు ఆయా ఉత్పత్తులను ప్రకృతి అందిస్తుంది. కానీ మనం మన సుఖం కోసం.. ఆ ప్రకృతిని పాడుచేస్తున్నాం. ఈరోజు తాటిముంజుల వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో సైంటిఫిక్ గా ప్రూవ్ చేసిన వాస్తవాలు చూద్దాం.

100 గ్రాముల తాటిముంజుల్లో ఉండే పోషకాలు

నీటిశాతం 77 iగ్రాములు
శక్తి 87 కాలరీలు
కొవ్వులు, మాంసకృతులు ఏం ఉండవు
కార్భోహైడ్రేట్స్ 21 గ్రాములు..

తక్షణ శక్తిని ఇవ్వడానికి, వేడిని చల్లార్చడానికి, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూడ్డానికి, లవణాలను రీప్లేస్ చేయడానికి తాటిముంజులు బాగా పనికొస్తాయి. సైంటిఫిక్ గా తాటిముంజులు గురించి ఏం చెప్తున్నారంటే.. వేసివిలో మనకు చెమట రూపంలో నీరు అధికంగా పోతుంది. రక్తంలో క్షార గుణం తగ్గి, ఆమ్ల గుణం పెరుగుతుంది. బ్లడ్ యసిడిక్ గా మారుతుంది. phలో మార్పులు వచ్చేసరికి.. ఫ్రీ రాడికల్స్ విడుదల అవుతాయి. ఇవి బాడీలో ఎక్కువైతే.. రక్షణ వ్యవస్థ తగ్గిపోయి ఇన్ప్లమేషన్స్ ఎక్కువగా వస్తాయి. బాడీలో పీహెచ్ ను క్షార గుణానికి తీసుకురావడానికి తాటిముంజుల్లో ఉండే గ్రూప్ ఆఫ్ కెమికల్స్, ఫినోలిక్ కాంపౌండ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి బాడీలో ఉండే ప్రీ రాడికల్స్ దోషాన్ని తక్కువ టైంలో ఎక్కువగా నివారిస్తాయట. రక్షణ వ్యవస్థకు కూడా చాలా మంచిది.

ఎంజైమ్స్, హార్మోన్స్ పనిచేసేట్లు కూడా తాటిముంజులు చేస్తాయి. అలాగే ప్రేగుల్లో కదలికలు పెంచి గ్యాస్ట్రిక్ మ్యూకస్ అనే జిగురు పదార్థాలను పెంచి.. ఆహారం బాగా అరిగేట్లు చేయడానికి కూడా తాటిముంజులు బాగా ఉపయోగపడతాయి. ఈ పరిశోధన అంతా 2018వ సంవత్సరంలో శాక్రెట్ ఆర్ట్ కాలేజ్, తిరువత్తూర్, తమిళనాడు( Sacred Art College Tirupattur- Tamilanadu) వారు అధ్యయనం ద్వారా కనుగొన్నారు.

వేసవి కాలంలో లభించే తాటిముంజులు ఎక్కడైనా విరివిగా లభిస్తున్నాయి. రోడ్డుపక్కన అమ్ముతున్నారు కదా అని చీప్ అనుకుంటారామో.. షోరూమ్స్ దొరికే వాటికంటే.. వేయిరెట్లు మంచివండి బాబూ.. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తాగడం కంటే.. ప్రకృతి ఇచ్చిన తాటిముంజులను చక్కగా తినేయండి.

ఎలా తినాలి..?

సాయంత్రం డిన్నర్ టైంలో బాగా ఒక 20 తిని..ఏదైనా ఒక రకం ఫ్రూట్ తినేస్తే.. చాలు.. ఆరోజు భోజనం చేయక్కర్లేదు. చాలామంది ఇతర ఆహారాలతో పాటుగా ఇది తింటుంటారు. అలా కాకుండా.. ఒక పూట బోజనంలా తాటిముంజులను తీసుకుంటే.. పొట్టకు చాలా హాయిగా ఉంటుంది. తక్షణ శక్తి లభిస్తుంది. ఈవినింగ్ డిన్నర్ లో ఇలాంటివి తింటే.. తెల్లవార్లు డీటాక్సిఫికేషన్ బాగా చేసి.. ఫ్రీరాడికల్స్ డామేజ్ కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. లేతగా ఉన్నవే తినాలి. ముదిరిపోయి గట్టిగా ఉన్నవి తినకూడదు. ఇంకోటి.. తాటిముంజులు తిని బజ్జీలు తినడం, పానీపూరీలు, కట్లేట్, నూనెలో దేవినవి ఏవి కూడా తినొద్దు. ఈ కాంబినేషన్ అరగక జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. ఇక మనం ముంజులు తినడం వల్లే ఇలా జరిగింది అనుకుంటాం. ఎన్ని తిన్నా తేలిగ్గా అరుగుతాయి. మంచి ఆహారంలా తీసుకుంటే చాలా బాగుంటుంది.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version