ఆన్ లైన్ తరగతుల కారణంగా ఎన్ని సమస్యలు కలగవచ్చో తెలుసా…?

ఎప్పుడు లేనిది కరోనా మహమ్మారి మన దేశం లోకి రావడంతో లాక్ డౌన్ మొదలవ్వడం… అన్ని మూసేయడం… ముఖ్యంగా పాఠశాలలు మూతబడటంతో ప్రైవేట్ విద్యా సంస్థలు ఆన్ లైన్ ద్వారా పాఠాలను బోధిస్తున్నాయి. దీని కారణంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికి కూడా అనేక కాలేజీలు, స్కూళ్ళు ఈ పద్ధతినే కొనసాగుతున్నారు. దీని వల్ల ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయి.

online classes
online classes

ఈ ఆన్ లైన్ తరగతుల కారణంగా పిల్లల పై ఒత్తిడి పెరగడమే కాక పిల్లల మానసిక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. మానసిక నిపుణులు ఈ ఆన్ లైన్ తరగతుల గురించి ఏం అంటున్నారంటే… పిల్లల్లో ఆలోచించే శక్తి కూడా తగ్గుతుందని పిల్లల్లో తార్కిక జ్ఞానం కూడా తగ్గుతోందని చెప్పారు. అలానే ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో పిల్లల్లో చదువుపై ఆసక్తి తగ్గుతుందన్నారు. ఆన్ లైన్ పాఠాల వల్ల పిల్లల భావ వ్యక్తీకరణ, మెదడు, ప్రవర్తన పై తీవ్ర ప్రభావం పడుతుందని స్పష్టం చేసారు. ఉపాధ్యాయులు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టలేకపోతున్నారు.

ఇక చాలా మంది కళాశాల విద్యార్థులు అయితే స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ లను గేమ్స్, మూవీస్, చాటింగ్ కోసం వినియోగిస్తున్నారు. వీటి వల్ల లక్ష్యాన్ని మరచిపోయి సమయాన్ని వృధా చేస్తున్నారు.
అలానే ఆన్ లైన్ తరగతుల వల్ల పిల్లల్లో క్రమశిక్షణ కూడా తగ్గుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎప్పటికప్పుడు వాళ్ళని గమనిస్తూ ఏమైనా సమస్యలు ఉంటే అడిగి తెలుసుకోవాలి. ఆన్ లైన్ క్లాసుల సమయంలో కాకుండా మిగతా సమయంలో విద్యార్థులను తల్లిదండ్రులకు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లకు దూరంగా ఉంచితే మంచిది. అస్తమానం అలా ఫోన్లతోనే కాలం గడపనివ్వకుండా ఆటలు ఆడించడం, మాట్లాడడం చేస్తూ ఉండాలి.